"చాలా మిస్ అవుతున్నాను.. నా ప్రతీ జ్ఞాపకంలో మీరుంటారు" - సూపర్ స్టార్ ఎమోషనల్ పోస్ట్ వైరల్
సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి తెలుగు సినీ ప్రియులుకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన అందం, అంతకు మించిన నటనతో దూసుకుపోతున్న ఈయన తాజాగా పాన్ వరల్డ్ స్థాయిలో ఓ సినిమా చేయబోతున్నారు. దర్శక ధీరుడు రాజమౌళితో కలిసి సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు సిద్ధం అయ్యారు. అయితే కెరియర్ పరంగా దూసుకు పోతున్న ఈయన తాజాగా ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. చాలా మిస్ అవుతున్నాను.. నా ప్రతీ జ్ఞాపకంలో మీరు ఉంటారు అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఎవరి కోసం ఆయన ఈ పోస్ట్ పెట్టారు, దాని వెనక ఉన్న కథేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
తెలుగు సినీ రంగంలో ఉన్న స్టార్ హీరోల్లో మహేష్ బాబు ఒకరు. టాలీవుడ్ లో ఉన్న టాప్ కుటుంబాల్లో వీరి ఫ్యామిలీ కూడా ఒకటి. అయితే తెలుగు చిత్రసీమ ఖ్యాతిని పెంచడంలో ఎప్పుడూ ముందే ఉన్న సూపర్ స్టార్ కృష్ణ గురించి కూడా అందరికీ తెలిసిందే. దాదాపు 50 సంవత్సరాల పాటు సినీ రంగంలో ఎదురులేని హీరోగా కొనసాగిన ఈయన జయంతి ఈరోదు. అయితే అనేక మంది ఈ సందర్భంగా ఆయనకు నివాళ్లు అర్పిస్తూ.. కేక్ లు కట్ చేస్తున్నారు. అయితే ఆయన కొడుకు మహేష్ బాబు కూడా తండ్రి గురించి ఎమోషనల్ పోస్ట్ చేశారు.

ముఖ్యంగా.. ఎక్స్ వేదికగా తన తండ్రి కృష్ణకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రతీ క్షణం మిమ్మల్ని మిస్ అవుతున్నానంటూ చెప్పుకొచ్చారు. నా ప్రతీ జ్ఞాపకంలోనూ మీరు ఎప్పుడూ జీవించే ఉంటారు అంటూ రాసుకొచ్చారు. కేవలం ఇలా చెప్పడమే కాకుండా.. తన తండ్రి యంగ్ గా ఉన్నప్పటి ఓ ఫొటోను షేర్ చేశారు. ప్రస్తుతం మహేష్ బాబు చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. ప్రతీ ఒక్కరూ దీనిపై స్పందిస్తున్నారు. మీ నాన్న ఎప్పుడూ మీ వెంటే ఉంటారు అన్నా అంటూ మహేష్ బాబు అభిమానులు చెప్పుకొస్తున్నారు.
తండ్రిపై మీకున్న ప్రేమను చూస్తుంటే చాలా ముచ్చటేస్తుందని కొందరు.. కృష్ణగారిని మేము కూడా చాలా మిస్ అవుతున్నాం అంటూ మరికొంత మంది తమ మనసులోని భావాలను కామెంట్ల రూపంలో వెల్లడిస్తున్నారు. 1943 మే 31వ తేదీన గుంటూరు జిల్లా తెనాలి మండలం బుర్రిపాలెంలో జన్మించిన కృష్ణ... 2022 నంవబర్ 15వ తేదీన మరణించారు. 79 ఏళ్ల వయసులో ప్రాణాలు కోల్పోయిన ఈయనకు ఇది 81వ పుట్టిన రోజు.


Click it and Unblock the Notifications











