Guntur Kaaram మహేష్‌బాబు నోటిలో త్రివిక్రమ్ అలాంటి బీడి.. శ్రీలీల ముందు సీక్రెట్ బయటపెట్టిన రమణగాడు!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం 48 ఏళ్ల వయసు కల్గిన ఆయన ఇప్పటికీ స్లిమ్ గా, ఎనర్జిటిక్ కా, చాలా యంగ్ గా కనిపించడానికి ప్రధాన కారణం ఆయన డైటే. అందంతో పాటు ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ఎప్పుడూ ముందు ఉండే ఈయన.. గుంటూరు కారం సినిమా కోసం బీడీ తాగారు. అయితే సినిమా షూటింగ్ లో భాగంగా చాలానే బీడీలు కాల్చి ఉంటారు.

Recommended Video

Guntur Kaaram బీడిల సీక్రెట్ .. Mahesh Babu Interview | Telugu Filmibeat

ఆరోగ్యంపై ఎంతో అవగాహన కల్గిన ఆయన స్మోకింగ్ చేయడం గురించి చాలా మందికి అనేక అనుమానాలు వచ్చాయి. అయితే ఇదే విషయాన్ని ఇంటర్వ్యూలో అడగ్గా.. ఆయన షాకింగ్ కామెంట్లు చేశారు. తాను తాగిన బీడీలో ఉన్నవి ఏంటే చెప్పి అందరినీ షాక్ కు గురి చేశారు. పూర్తి వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Super Star Mahesh babu Facing Problems With Beedi in Guntur Kaaram Shotting Check Details

అతడు, ఖలేజా వంటి సూపర్ డూపర్ హిట్టు సినిమాల తర్వాత అంటే దాదాపు 13 ఏళ్ల తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో మహేష్ బాబు గుంటూరు కారం సినిమా చేశాడు. కచ్చితంగా హ్యాట్రిక్ కొట్టాలన్నా కసితో అద్భుతమైన కథతో వచ్చారు. అయితే ఇందులో మహేష్ బాబు క్యారెక్టర్ కు తగ్గట్లుగానే అందులో బీడీ తాగాల్సి వచ్చింది. వీరిద్దరి కాంబోలో సినిమా వస్తుందని తెలిసినప్పటి నుంచే అభిమానులు పెద్ద ఎత్తున ఆసక్తి చూపించారు. బీడీ తాగుతూ.. మహేష్ బాబు లుంగీలో కనిపిస్తున్నారని తెలుసుకుని తెగ ఎగ్జైట్ అయ్యారు.

మిల్క్ బాయ్ మహేష్ ను ఊర మాస్ లుక్ లో చూపించాలంటే లుంగీ, బీడీ కన్ఫార్మ్ అని భావించిన డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ బీడీలు అలవాటు చేసుకొమ్మని చెప్పారట. అయితే మహేష్ బాబు కూడా డెడికేటెడ్ గా ముందుగా ఓ బీడీ తీసి కాల్చారట. ఒక్క బీడీ తాగగానే ఆయనకు విపరీతమైన తలనొప్పి వచ్చేసిందట. ఎప్పుడూ లేనంతగా తలనొప్పి రావడంతో అస్సలే స్మోకింగ్ చేయకూడదని ఫిక్స్ అయ్యారట. పొగతో పాటు పొగాకు ఘాటును కూడా అస్సలే తట్టుకోలకేపోయారట. అయితే ఇదే విషయాన్ని డైరెక్టర్ చెప్పారట.

Super Star Mahesh babu Facing Problems With Beedi in Guntur Kaaram Shotting Check Details

మహేష్ బాబు సమస్య అర్థం చేసుకున్న డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా.. చాలా ఆలోచించారట. కచ్చితంగా ఈ సినిమాలో బీడీ తాగాల్సి ఉంటుంది.. కానీ అది పొగాకు బీడీ కాకపోతే సరిపోతుందని అన్నారట. వెంటనే పలువురు నిపుణులను పిలిపించి మరీ మహేష్ బాబు కోసం స్పెషల్ బీడీలు తయారు చేయించారట. అందులో పొగాకు బదులుగా లవంగాళ ఆకులతో బీడీలు చేయించారట. ప్రత్యేకమైన ఆయుర్వేదిక్ బీడీలను మాత్రమే తయారు చేయగా.. మహేష్ బాబు వాటిని తాగారట. వాటి వల్ల ఎలాంటి సమస్య ఉండకపోవడం వల్లే సినిమాలో అనేక బీడీలు కాల్చినట్లు చెప్పుకొచ్చారు.

అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మహేష్ బాబు ఈ విషయాలను శ్రీలీల ముందే వెల్లడించారు. అలాగే తాను అస్సలే స్మోక్ చేయనని.. ఎవరూ చేయకూడదని తరచుగా చెబుతానని కూడా వివరించారు. మహేష్ బాబు చేసిన ఈ కామెంట్లు తెలుసుుకున్న సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. తమ అభిమాన నటుడు.. ఆరోగ్యం, విలువలకు ప్రాధాన్యత ఇస్తారని.. యువతకు కూడా మంచి మార్గం సూచిస్తారంటూ కామెంట్లు చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X