2024లో ఆ టాలీవుడ్ హీరో ఫ్యామిలీ అన్ని దేశాలు చుట్టేసిందా?.. ఎన్టీఆర్‌కు తెలిస్తే షాకే
సూపర్‌స్టార్ కృష్ణ నటవారసుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు తండ్రికి తగ్గ తనయుడిగా నిరూపించుకుని టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరిగా వెలుగొందుతున్నారు. ఒక్క పాన్ ఇండియా సినిమాలోనూ నటించుకున్నా.. నేషనల్ , ఇంటర్నేషనల్ పాపులారిటీని సంపాదించడం ఒక్క మహేశ్ ఒక్కరికే చెల్లింది.
సినిమాలే కాదు.. బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్, ప్రకటనల ద్వారా రూ.కోట్లలో ఆర్జిస్తున్నారు మహేశ్ బాబు. పలు రంగాల్లో పెట్టుబడులు పెట్టి రియల్ లైఫ్‌లోనూ బిజినెస్‌మెన్‌గానూ హిట్ కొట్టారు మహేశ్. ఏఎంబీ సినిమాస్, ది హంబుల్ కో వస్త్ర వ్యాపారం, తన భార్య నమ్రత పేరు మీద హైదరాబాద్‌లో రెస్టారెంట్‌తో పాటు జీ మహేశ్ బాబు ఎంటర్‌టైన్‌మెంట్స్ పేరుతో భారీ బడ్జెట్ సినిమాలను సైతం తెరకెక్కిస్తున్నారు.

సంపాదించడమే కాదు, సామాజిక సేవ, విరాళాల విషయంలోనూ ఆయన ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రతి ఏటా తన సంపాదనలో నుంచి రూ.25 నుంచి రూ.30 కోట్లను దాన ధర్మాలకు వెచ్చిస్తున్నారు. తన తండ్రి పుట్టిన ఊరైన ఏపీలోని బుర్రిపాలెంతో పాటు తెలంగాణలోని సిద్ధాపురం గ్రామాలను దత్తత తీసుకుని అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు. ఇక గుండె జబ్బులతో బాధపడుతున్న వేలాది మంది చిన్నారులకు శస్త్రచికిత్సలు చేయించి నిజమైన శ్రీమంతుడిగా నిలిచారు.
అయితే మహేశ్ బాబులో ఉన్న మరో గొప్ప లక్షణం కుటుంబానికి సమయం కేటాయించడం. సినిమాలు, షూటింగ్స్, వ్యాపారాలతో ఊపిరి సలపనంత బిజీగా ఉన్నప్పటికీ భార్యాబిడ్డలతో గడపడానికి ఆయన ఇష్టపడతారు. మీడియాకు దూరంగా ఇంటికే పరిమితమై వాళ్లను సంతోషంగా ఉంచడానికి ప్రయత్నిస్తారు. ఇక వీలున్నప్పుడల్లా కుటుంబంతో కలిసి విహారయాత్రలు, విదేశీ యాత్రలు చేస్తారు. కొడుకుగా, తండ్రిగా, భర్తగా అంతకుమించి మంచి మనిషిగా మహేశ్ బాబును ఇండస్ట్రీ జనాలే మెచ్చుకుంటారంటే అతిశయోక్తి కాదు. మహేశ్ బాటలోనే మిగిలిన స్టార్ హీరోలు ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్‌లు తమ ఫ్యామిలీలకు సమయాన్ని వెచ్చిస్తున్నారు.
ఎప్పటిలాగే గతేడాది కూడా మహేశ్ ఫ్యామిలీ ఫారిన్ ట్రిప్స్ వేసింది. తాజాగా నమ్రత శిరోద్కర్ 2024లో ఏఏ వెకేషన్స్‌కు వెళ్లారో వాటి పేర్లు, ఆ ప్రాంతాలకు సంబంధించిన వివరాలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. గతేడాది మొనాకో, లండన్, న్యూయార్క్, పోర్టోఫినో, మాల్దీవ్స్, దుబాయ్, జెనీవా, బ్యాంకాక్, బాడెన్, ఎస్టీ మోరిట్జ్, జైపూర్, ముంబై వంటి లొకేషన్స్‌లో టూర్‌కి వెళ్లినట్లు నమ్రత వెల్లడించారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అయితే మహేశ్ బాబు టూర్లకు సంబంధించి మీలో ఎవరు కోటీశ్వరుడు షోలో ఎన్టీఆర్ అడుగుతాడు. అన్నా మీరు ఏడాదికి మూడు , నాలుగు సార్లు ఫారిన్ వెళ్లిపోతారని ప్రశ్నిస్తాడు. మీలాంటి వాళ్లు దిష్టి పెట్టడంతో కరోనాతో ఇంట్లోనే కూర్చోవాల్సి వచ్చిందని పంచ్ విసిరుతారు మహేశ్ బాబు. ఈ నేపథ్యంలో గతేడాది మహేశ్ ఫ్యామిలీ వెళ్లిన ఫారిన్ ట్రిప్‌ల గురించి తెలిస్తే ఎన్టీఆర్ షాక్ అవ్వడం ఖాయమంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.


Click it and Unblock the Notifications











