మూడేళ్ల తర్వాత మహేష్ సినిమా.. అయినా పండగ చేసుకొంటున్న ఫ్యాన్స్.. కారణం ఇదే!

సూపర్‌స్టార్ మహేశ్ బాబు త్రివిక్రమ్ కాంబో గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మహేశ్‌కు అతడు , ఖలేజా వంటి మెమొరబుల్ హిట్స్‌ను అందించారు త్రివిక్రమ్ . ఈ రెండు సినిమాలు ఆయనను కంప్లీట్‌గా మేకోవర్ చేయగా.. మహేశ్ కెరీర్‌కు కూడా ఎంతో బూస్ట్ ఇచ్చాయి. అయితే తిరిగి మహేశ్ - త్రివిక్రమ్ కాంబినేషన్ సెట్ అవ్వడానికి దశాబ్ధానికి పైగా సమయం పట్టింది. ఈ మధ్యలో వీరి మధ్య గ్యాప్ వచ్చినట్లు పుకార్లు సైతం చక్కర్లు కొట్టాయి.

అలా దాదాపు 12 ఏళ్ల తర్వాత వచ్చిన చిత్రమే గుంటూరు కారం. గతేడాది సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా మంచి వసూళ్లు సాధించింది. సరైన ప్రమోషన్స్ లేకపోవడంతో ఈ సినిమా ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేదని విమర్శలు వెల్లువెత్తాయి. కాకపోతే సంక్రాంతి సీజన్ కావడంతో పండుగ సెలవులు కలిసొచ్చి సినిమా బాగానే కలెక్ట్ చేసి మహేశ్ పరువు నిలబెట్టింది.

super star mahesh babu fans remembering 1 year for Guntur Kaaram trailer

థియేటర్‌లో పర్లేదు అనిపించుకున్నా ఓటీటీలో మాత్రం గుంటూరు కారం మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇక టీవీల్లో కూడా ఈ సినిమాకు బుల్లితెర ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. తొలిసారి గుంటూరు కారం టెలికాస్ట్ అయినప్పుడు 9.2 టీఆర్పీ రేటింగ్ నమోదు కాగా.. రెండోసారి 6.13 రేటింగ్ వచ్చింది. ప్రస్తుతం ఓటీటీలు అందుబాటులోకి వచ్చాక టీవీలు ఎక్కువ మంది చూడటం లేదు. అలాంటి టైంలో గుంటూరు కారంకి మంచి టీఆర్పీలు రావడం విశేషం.

ఇక గుంటూరు కారంతో మహేశ్ బాబు పలు రికార్డులను నెలకొల్పారు. ఈ సినిమాలోని కుర్చీ మడతపెట్టి అనే సాంగ్ మాస్‌ను ఊపేసింది. శ్రీలీల అంద చందాలు , మహేశ్ లుక్, సాహిత్యంతో జనం ఈ పాటకు బ్రహ్మరథం పట్టారు. ఈ పాట యూట్యూబ్‌లో ప్రపంచవ్యాప్తలంగా 527 మిలియన్ల వ్యూస్ అందుకుంది. అంతేకాదు.. గతేడాది ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వ్యూస్ దక్కించుకున్న టాప్ 5లో ఒకటిగా కుర్చీ మడతపెట్టి సాంగ్ నిలిచింది.

super star mahesh babu fans remembering 1 year for Guntur Kaaram trailer

ఇక బాక్సాఫీస్ విషయానికి వస్తే టోటల్ రన్‌లో రూ. 190 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను అందుకుని రూ.133 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌లో రూ. 115 కోట్లు మాత్రమే రికవరీ చేసి నష్టాలను మూటకట్టుకుంది. ప్రస్తుతం రీ రిలీజ్ ట్రెండ్ నేపథ్యంలో న్యూఇయర్ కానుకగా గుంటూరు కారం సినిమాను ప్రేక్షకుల ముందుకు మరోసారి తీసుకొచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ముఖ్య కేంద్రాల్లో గుంటూరు కారం సందడి చేసింది. బుకింగ్స్ ప్రారంభమైన క్షణాల్లోనే హౌస్‌ఫుల్ పడి సాలీడ్ వసూళ్లు రాబట్టింది.

తాజాగా గుంటూరు కారం విషయంలో మరోసారి అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. అదేంటి అంటే గుంటూరు కారం ట్రైలర్ విడుదలై జనవరి 7కి ఏడాది పూర్తయ్యింది. ఈ సందర్భంగా మహేశ్ అభిమానులు ట్రైలర్‌ను మరోసారి ట్రెండ్ చేస్తున్నారు. విడుదలైన 24 గంటల్లోనే 37.68 మిలియన్ వ్యూస్‌.. 665.8 వేల లైక్స్ రాబట్టి టాప్ ప్లేస్‌లో నిలిచింది. నిన్న మొన్నటి వరకు ఈ రికార్డు పదిలంగానే ఉంది . అయితే అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 ది రూల్ 44.67 మిలియన్ వ్యూస్‌.. 885.4 వేల లైక్స్‌తో గుంటూరు కారం రికార్డును బద్ధలుకొట్టింది. సో .. అదన్నమాట విషయం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X