Guntur Kaaram: సూపర్ స్టార్ సినిమాకు సెన్సార్ రియాక్షన్.. రన్ టైమ్ ఎంతంటే?
సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో రాబోతున్న తాజా చిత్రమే గుంటూరు కారం. అతడు, ఖలేజా సినిమాల త్రవాత అంటే దాదాపు 13 సంవత్సరాల తర్వాత రాబోతున్న వీరిద్దరి కాంబోలో రాబోతున్న ఈ సినిమాపై పెద్ద ఎత్తున అంచనాలు నెలకొన్నాయి. ఇప్పిటే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్, టీజర్, ట్రైలర్, పాటలకు విపరీతమైన స్పందన వచ్చింది. ముఖ్యంగా కుర్చి మడతపెట్టి పాటకు అయియే ఎవరూ ఊహించని స్థాయిలో వ్యూస్ వచ్చాయి. ఇక నిన్ననే విడుదల అయిన ట్రైలర్ కూడా అదిరిపోయింది.
సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12వ తేదీన థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కాబోతున్న ఈ సినిమాను శ్రీమతి మమత సమర్పణలో హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ నిర్మించారు. మిల్క్ బాయ్ మహేష్ పక్కన ఈ సినిమాలో క్యూట్ బ్యూటీ శ్రీలీల, మీనాక్షి చౌదరిలు హీరోయిన్లుగా నటించబోతున్నారు. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో కూడా ఈ సినిమా విడుదల కానుంది.

మహేష్ బాబు, శ్రీలీలతో పాటు ప్రకాశ్ రాజ్, జగపతిబాబు, జయరాం, రమ్యకృష్ణ, ఈశ్వరీ రావు, రావు రమేష్, మురళీ శర్మ, సునీల్, బ్రరహ్మానందం, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, మధుసూధన్ రావు, అజయ్ ఘోష్, మహేష్ ఆచంట, రఘుబాబులు ఈ సినిమాలో కనిపించి మెస్మరైజ్ చేసేందుకు సిద్ధం అవుతున్నారు. దాదాపు 200 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా... తాజాగా ఈ సినిమా సెన్సార్ ను పూర్తి చేసుకుంది. అయితే మహేష్ బాబు గుంటూరు కారం చిత్రానికి ఏ సర్టిఫికేట్ వచ్చింది, రన్ టైమ్ ను ఎంతకు ఫిక్స్ చేశారో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

గుంటూరు కారం సినిమాకు సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికేట్ ను ఇచ్చింది. అలాగే సినిమా రన్ టైమ్ ను 159 నిమిషాలుగా ఫిక్స్ చేసింది. 2 గంటల 39 నిమిషాల నిడివితో ఉన్న ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కాబోతుండగా.. ఫస్ట్ ఆఫ్ 85 నిమిషాలు ఉంది. అలాగే సెకండ్ ఆఫ్ 74 నిమిషాలుగా ఫిక్స్ చేశారు. ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను జనవరి 12వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. చూడాలి మరి ఈ సినిమా ఏ రేంజ్ లో ప్రేక్షకులను ఆకట్టుకోనుందో.


Click it and Unblock the Notifications











