మహేష్ అభిమానులకు నిరాశ.. మహర్షి విడుదల ఎప్పుడంటే!
సూపర్ స్టార్ మహేష్ నటిస్తున్న తాజా చిత్రం మహర్షి. రైతు సమస్యల నేపథ్యంలో ఈ చిత్రం ఉండబోతోంది. వంశీ పైడిపల్లి దర్శత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. అశ్విని దత్, దిల్ రాజు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పూజ హెగ్డే మహేష్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. తాజా సమాచారం ప్రకారం మహర్షి చిత్రానికి సంబందించిన చాలా భాగం షూటింగ్ ఇంకా పూర్తి కావలసి ఉందట.
దర్శకుడు వంశీ పైడిపల్లి ప్రతి సన్నివేశాన్ని పక్కాగా ప్లాన్ చేసి చిత్రీకరిస్తుండడంతో ఆలస్యం జరుగుతున్నట్లు తెలుస్తోంది. దీనితో ముందుగా అనుకున్న ఏప్రిల్ నెలలో ఈ చిత్రం విద్దులయ్యేలా కనిపించడం లేదు. ముందుగా ఏప్రిల్ మొదటివారం 5వ తేదీనే ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత 25న అంటూ వార్తలు వచ్చాయి.

తాజాగా ఈ చిత్ర విడుదలని 2 నెలల పాటు వాయిదా వేసినట్లు తెలుస్తోంది. జూన్ నెలలో మహర్షి విడుదలకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అల్లరి నరేష్ ఈ చిత్రంలో మహేష్ స్నేహితుడిగా కీలక పాత్రలో నటిస్తున్నాడు. గత ఏడాది వచ్చిన భరత్ అనే నేను చిత్రం మంచి విజయం సాధించింది. దీనితో మహర్షిపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొని ఉన్నాయి.


Click it and Unblock the Notifications











