మహేష్ బాబుని మెప్పించిన గీత గోవిందం దర్శకుడు!

మహేష్ బాబు ఏ ఏడాది మొత్తం బిజీగా గడిపేలా ఉన్నాడు. మహేష్ నటిస్తున్న తాజా చిత్రం మహర్షి. వంశీ పైడిపల్లి దర్శత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. అశ్విని దత్, దిల్ రాజు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పూజ హెగ్డే మహేష్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీత అందిస్తున్నాడు. మహర్షి తర్వాత మహేష్ ఇటీవల్ ఎఫ్2తో ఘనవిజయం సొంతం చేసుకున్న అనిల్ రావిపూడికి అవకాశం ఇచ్చాడు.

తాజాగా గీతగోవిందం ఫేమ్ పరశురామ్ మహేష్ బాబుకు ఓ కథ వినిపించాడట. పరశురామ్ చెప్పిన స్టోరీ లైన్ మహేష్ కు బాగా నచ్చినట్లు తెలుస్తోంది. ఈ కథని పూర్తి స్థాయిలో సిద్ధం చేసి తీసుకురమ్మని మహేష్ పరశురామ్ కు సూచించినట్లు వార్తలు వస్తున్నాయి. పరశురామ్ స్క్రిప్ట్ ని పక్కాగా సిద్ధం చేసుకుని వెళితే మహేష్ పచ్చ జెండా ఊపడం ఖాయం. మరి పరశురామ్ ఈ అద్భుత అవకాశాన్ని ఎలా సద్వినియోగం చేసుకుంటాడో చూడాలి.

Super star Mahesh Babu okeys Geetha Govindam fame Parasuram script

పరశురామ్ తెరకెక్కించిన గీత గోవిందం చిత్రం 70 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి ఘనవిజయం సాధించింది. గీత గోవిందం తర్వాత పరశురామ్ తన తదుపరి చిత్రాన్ని ప్రకటించలేదు. అన్ని కుదిరితే మహేష్ బాబుతోనే ఈ దర్శకుడు సినిమా మొదలుపెట్టొచ్చు. మరో వైపు అల్లు అరవింద్ కూడా ఎప్పటినుంచో మహేష్ తో ఓ సినిమా చేయాలని ఎదురుచూస్తున్నారు. వీరి ముగ్గురి కాంబినేషన్ సెట్ అవుతుందేమో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X