'మహర్షి' డబ్బింగ్ ప్రారంభం.. అల్లరి నరేష్ ఎలా ఉన్నాడో చూశారా!
సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం మహర్షి. వంశీ పైడిపల్లి దర్శత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఈ ఏడాది ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. మహేష్ బాబు పాత్ర ఈ చిత్రంలోమూడు కోణాల్లో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. వ్యవసాయంలో రైతులకు సరికొత్త విధానాన్ని అందించే కార్పొరేట్ సంస్థ అధినేతగా మహేష్ బాబు ఈ చిత్రంలో నటిస్తున్నాడట. మహేష్ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.
తాజాగా ఈ చిత్ర డబ్బింగ్ కార్యక్రమాలని చిత్ర యూనిట్ ప్రారంభించింది. చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకోవడంతో దర్శకుడు వంశీ పైడిపల్లి నిర్మాత దిల్ రాజు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు షురూ చేస్తున్నారు. నేడు మహర్షి డబ్బింగ్ ని అల్లరి నరేష్ ప్రారంభించారు. వంశీ పైడిపల్లి, దిల్ రాజు కూడా హాజరయ్యారు. అల్లరి నరేష్ ఈ చిత్రంలో మహేష్ బాబు స్నేహితుడిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. అల్లరి నరేష్ తాజాగా లుక్ లో బాగా గడ్డం పెంచి కనిపిస్తున్నాడు. బహుశా సినిమాలో కూడా ఇదే లుక్ ఉండనుంది.

ఏప్రిల్ 25న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు దిల్ రాజు ప్రకటించారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. మహేష్, అల్లరి నరేష్ మధ్య సాగే సన్నివేశాలు ఎమోషనల్ గా ఉండనున్నట్లు తెలుస్తోంది. వంశీ పైడిపల్లి బలమైన కథతో మహర్షి చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇప్పటికే చిత్రానికి సంబందించిన కొన్ని పిక్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూ ఫ్యాన్స్ లో ఉత్కంఠ పెంచుతున్నాయి.



Click it and Unblock the Notifications











