ఇదే నాకు చివరి తెలుగు సినిమా.. అందుకే అలాంటి డ్యాన్పులు చేశా.. మహేష్ బాబు

టాలీవుడ్ సూపర్ స్టార్, మిల్క్ బాయ్ మహేష్ బాబు గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాల నటుడిగా తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టిన ఇతడు.. ఇప్పటికీ స్టార్ హీరోగా కొనసాగుతూనే ఉన్నాడు. ఈయన అన్నా, ఈయన సినిమాలు అన్నా చాలా మందికి ఇష్టం. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈయనకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే చాలా పెద్దదే. తెలుగు హీరో అయిన ఈయన తాజాగా షాకింగ్ కామెంట్లు చేశారు. గుంటూరు కారమే తనకు చివరి తెలుగు సినిమా అని చెప్పారు. పూర్తి వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

మహేష్ బాబు తాజాగా చేసిన సినిమా గుంటూరు కారం. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో మహేష్ బాబు చేసిన మూడో చిత్రం ఇది. గతంలో అతడు, ఖలేజా వంటి బ్లాక్ బస్టర్ హిట్టు చిత్రాలు చేసిన ఈ కాంబో.. పదమూడేళ్ల తర్వాత గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12వ తేదీన విడుదల అయిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద భారీగా వసూళ్లును రాబట్టుకుంటుంది. సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్తున్న ఈ సినిమాను చూసేందుకు పెద్ద ఎత్తన జనాలు ఆసక్తి కనబరుస్తున్నారు.

Recommended Video

Mahesh Babu షాకింగ్ కామెంట్స్..SSMB 29 తో ఇక Pan World పైనే గురి..? | Telugu Filmibeat

Super Star Mahesh babu Said Guntur Kaaram His Last Telugu Film Check Details

హారిక & హాసిని క్రియేషన్స్ బ్యానర్‌లో ఎస్. రాధా కృష్ణ నిర్మించిన ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ క్యూ బ్యూటీ శ్రీలీల, మీనాక్షి చౌదరిలు హీరోయిన్లుగా నటించారు. అలాగే జగపతి బాబు, రమ్య కృష్ణ, ప్రకాష్ రాజ్, జయరామ్, ఈశ్వరీ రావు, రావు రమేష్, మురళీ శర్మ, సునీల్, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, అజయ్ ఘోష్, మహేష్ ఆచంట, రఘుబాబులు కీలక పాత్రల్లో కనిపించారు. ముఖ్యంగా తమన్ అందించిన అదిరిపోయే మ్యూజిక్ తో వచ్చిన పాటలు అయితే అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

Super Star Mahesh babu Said Guntur Kaaram His Last Telugu Film Check Details

దమ్ మసాలాతో పాటు కుర్చి మడతపెట్టి పాటకు ఈ రేంజ్ లో క్రేజ్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సూపర్ స్టార్ మహేష్ బాబు, శ్రీలీలలు షాకింగ్ కామెంట్లు చేశారు. తాను చేయబోయే చివరి తెలుగు సినిమా ఇదే అయ్యే అవకాశం ఉందని మహేష్ బాబు చెప్పుకొచ్చారు. దీని బట్టి చూస్తుంటే ఈయన నెక్స్ట్ సినిమాలన్నీ పాన్ ఇండియావో, పాన్ వరల్డ్ చిత్రాలో అవుతాయని తెలుస్తోంది. ఓన్లీ తెలుగు భాష చిత్రాల్లో మాత్రం ఈయన కనిపించడం తక్కువ కాబోతున్నట్లు అర్థం అవుతోంది.

Super Star Mahesh babu Said Guntur Kaaram His Last Telugu Film Check Details

ఇదే తనకు చివరి తెలుగు సినిమా అయ్యే అవకాశం ఉన్నందునే.. ముందు నుంచి రెండు మాస్ సాంగ్స్ లో ఫుల్ గా డ్యాన్స్ చేయాలని అనుకున్నారట. త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా అలాగే భావించారట. అందుకే కుర్చి మడతపెట్టి పాటతో మరో పాటలోనూ డ్యాన్స్ ఇరగదీశారట. ఈ చిత్రం తర్వాత మహేష్ బాబు.. దర్శకధీరుడు రాజమౌళితో ఓ సినిమా చేయనున్నారు. దానిపై ఇప్పిటకే పెద్ద ఎత్తున అంచనాలు నమోదు అయ్యాయి. చూడాలి మరి ఏం జరగనుంది అనేది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X