SSMB28: 11 ఏళ్ల తర్వాత త్రివిక్రమ్, మహేష్ కాంబో.. రిలీజ్ ఎప్పుడంటే?

సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ అందించింది హారిక హాసిని క్రియేషన్స్ సంస్థ. నిజానికి సూపర్ స్టార్ మహేష్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమా ఎప్పుడు ఎప్పుడు వస్తుందా అని మహేష్ బాబు అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే ఆ సమయం రానే వచ్చింది. అయితే ముందు చెప్పిన సమయం కన్నా గంటన్నర లేటుగా అప్డేట్ ఇచ్చింది హారిక హాసిని సంస్థ. టెక్నికల్ ఇష్యూ వల్ల లేట్ అవుతుందని ముందే పేర్కొన్న హారిక హాసిని సంస్థ ప్రకటనలోకి వెళితే

11 ఏళ్ల తర్వాత కాంబినేషన్

11 ఏళ్ల తర్వాత కాంబినేషన్

సూపర్ స్టార్ మహేష్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఇద్దరూ కలిసి మొట్టమొదటిసారిగా 2005లో అతడు అనే సినిమా చేశారు. ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఇప్పటికీ మా టీవీలో ఈ సినిమా ప్రసారం అవుతుంది అంటే జనాలు కదలకుండా చూస్తూ ఉంటారు. ఇక ఇద్దరూ కలిసి ఆ తర్వాత మహేష్ ఖలేజా అని ఒక సినిమా చేశారు. అయితే భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఆ తర్వాత ఇద్దరి మధ్య ఎన్నోసార్లు సినిమాలకు సంబంధించిన చర్చలు జరిగినా ఎప్పుడూ సినిమా అనౌన్స్మెంట్ దాకా వెళ్లలేదు. ఇప్పుడు అనూహ్యంగా దాదాపు 11 ఏళ్ల తర్వాత ఈ సినిమా సెట్ అయింది.

రిలీజ్ డేట్

రిలీజ్ డేట్

సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం అవుతుందని కూడా ఈ సినిమా ప్రకటనలో పేర్కొన్నారు. మరో ఆసక్తికర అంశం ఏమిటంటే ఇంకా షూటింగ్ కూడా మొదలు కాని ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్లో రిలీజ్ అవుతుంది అంటూ ప్రకటన చేయడం ఆసక్తికరంగా మారింది. నిజానికి మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ అవుతుందని ప్రకటించారు. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తే అప్పటికి కూడా రిలీజ్ అయ్యేలా కనిపించడం లేదు. కానీ మహేష్ - త్రివిక్రమ్ సినిమాను 2022 సమ్మర్ కి రిలీజ్ చేయాలని ప్లాన్ చేయడం ఆసక్తికరంగా మారింది.

 హారిక, హాసిని బ్యానర్‌లో

హారిక, హాసిని బ్యానర్‌లో

త్రివిక్రమ్ ఎప్పుడూ సినిమాలు చేసే హారిక, హాసిని సంస్థ ఈ సినిమాను నిర్మించబోతోంది. ఇప్పుడు అయితే త్రివిక్రమ్ ఈ బ్యానర్ లో తప్ప మరో బ్యానర్ లో సినిమాలు చేయడం లేదు. నిజానికి ముందుగా జులాయి అనే సినిమాతో త్రివిక్రమ్ కు పరిచయం అయ్యారు ఈ సంస్థ అధినేత. ఆ సినిమాను డి.వి.వి.దానయ్యతో కలిసి హారిక హాసిని క్రియేషన్స్ సంస్థ అధినేత చిన్నబాబు నిర్మించారు. అప్పటి నుంచి త్రివిక్రమ్ చేస్తున్న దాదాపు అన్ని సినిమాలు ఈ బ్యానర్ లోనే వస్తున్నాయి. ఒక్క అల వైకుంఠపురంలో సినిమాకి మాత్రమే అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ కూడా సహ నిర్మాణ సంస్థగా వ్యవహరించింది.

 ఎన్టీఆర్ ను వదిలేసి మహేష్ బాబుతో

ఎన్టీఆర్ ను వదిలేసి మహేష్ బాబుతో

అసలు ముందు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కాల్సి ఉంది. ఎన్టీఆర్ 30 పేరుతో హారిక హాసిని క్రియేషన్స్ సంస్థ గతంలో ఈ సినిమాను అధికారికంగా ప్రకటించింది. కళ్యాణ్ రామ్ కి చెందిన ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ తో కలిసి ఎన్టీఆర్ 30వ సినిమా నిర్మిస్తున్నామని గతంలో ప్రకటించారు. అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ హఠాత్తుగా ఎన్టీఆర్ 30వ సినిమా కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారని మరో ప్రకటన వచ్చింది. అప్పుడే మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబో సెట్ అయిందని అందుకే ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమా క్యాన్సిల్ అయిందనే వార్తలు కూడా వినిపించాయి. దాని మీద మాత్రం సరయిన క్లారిటీ లేదు.

Recommended Video

Potti Veeraiah ఇక లేరు | అప్పట్లో శోభన్ బాబు సలహాతో..!! || Filmibeat Telugu
సర్కారు వారి పాటలు బిజీగా మహేష్

సర్కారు వారి పాటలు బిజీగా మహేష్

ప్రస్తుతం మహేష్ సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట అనే సినిమా చేస్తున్నాడు. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. భారతదేశంలో ఉన్న బ్యాంకింగ్ ఫ్రాడ్స్ కు సంబంధించిన కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోందని ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా మొదటి షెడ్యూల్ దుబాయ్ లో షూటింగ్ జరిపారు.. ఇప్పుడు హైదరాబాద్ లో సెకండ్ షెడ్యూల్ షూటింగ్ జరపాల్సి ఉండగా కరోనా సెకండ్ వేవ్ రావడంతో ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X