స్విట్జర్లాండ్‌లో చిల్ అవుతోన్న మహేశ్ ఫ్యామిలీ .. జీన్స్ ప్యాంట్‌లో సితారను చూశారా?

సూపర్‌స్టార్ మహేశ్ బాబు కుమార్తె సితార ఘట్టమనేని గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిన్న వయసులోనే స్టార్ కిడ్‌గా సెలబ్రెటీగా మారిపోయారు సితార. తన వీడియోలు, ఫోటోలతో సోషల్ మీడియాలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించింది. అంతేకాదు.. తల్లిదండ్రుల బాటలో పలు కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్‌గా మారి.. పలు ఫేమస్ బ్రాండ్స్‌కి ప్రచారకర్తగా ఇప్పటి నుంచే రెండు చేతులా సంపాదిస్తోంది. ఈ ఏజ్‌లోనే అతిపెద్ద యాడ్ కాంట్రాక్ట్స్‌పై సంతకం చేసిన తొలి స్టార్ కిడ్‌గా నిలిచింది.

సితార ఓ జ్యువెలరీ యాడ్‌లో కనిపించగా.. దానిని గతేడాది అమెరికా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రఖ్యాత న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌లో ప్రదర్శించారు. దీనికి సంబంధించిన వీడియో అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. చిన్న వయసులోనే కూతురు సాధించిన ఘనతను చూసి మహేశ్ పొంగిపోతున్నారు. నిన్ను చూస్తుంటే గర్వంగా ఉందని.. ఇలాగే కొనసాగాలని ఆకాంక్షిస్తున్నానని సూపర్‌స్టార్ ఆకాంక్షించారు.

super star Mahesh babu wife namrata Shirodkar and daughter sitara ghattamaneni s switzerland vacation photos

ఇక ఈ ఏడాది జరిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ- రాధిక మర్చంట్‌ల వివాహ వేడుకకు మహేశ్ కుటుంబం హాజరై స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. సితార, భార్య నమ్రతలతో కలిసి మహేశ్ ఫోటోలకు ఫోజులిచ్చారు. ఇదే సమయంలో హాలీవుడ్ నటి కిమ్ కర్దాసియాన్‌తో సితార సెల్ఫీలు దిగి .. వాటిని తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.

సినిమాలు, షూటింగ్స్, వ్యాపారాలతో ఎంత బిజీగా ఉన్నా కుటుంబానికి సమయం కేటాయిస్తారు మహేశ్ బాబు. ఎప్పుడు వీలుంటే అప్పుడు భార్యాపిల్లలతో కలిసి ఫారిన్ ట్రిప్ వేయాల్సిందే. మహేశ్ చూపిన బాటలో ఇప్పుడు ఎంతో మంది స్టార్స్ తమ ఫ్యామిలీలతో గడుపుతూ ఎంజాయ్ చేస్తున్నారు. సూపర్‌స్టార్‌కు కుటుంబమే బలం.. ఆయన వెనుక భార్య, ఇతర కుటుంబ సభ్యులు తోడుగా నిలిచి అండగా ఉంటున్నారు.

ఇకపోతే ప్రస్తుతం దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మహేశ్ బాబు ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. యాక్షన్ అడ్వెంచర్ జోనర్‌లో తెరకెక్కనున్న ఈ సినిమా వచ్చే ఏడాది సెట్స్‌పైకి వెళ్లనుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్‌తో పాటు లొకేషన్ల ఎంపికలో జక్కన్న బిజీగా ఉన్నారు. అటు మహేశ్ కూడా తొలిసారిగా లాంగ్ హెయిర్, గడ్డంతో కొత్త లుక్‌లో కనిపిస్తున్నారు.

కాగా.. ప్రస్తుతం మహేశ్ సతీమణి నమ్రత శిరోద్కర్, కుమార్తె సితారలు స్విట్జర్లాండ్‌ ట్రిప్‌లో ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడి వీధుల్లో క్రిస్మస్ సెలబ్రేషన్స్‌ చూస్తూ వీరిద్దరూ సేద తీరుతున్నారు. ఈ ఫోటోలలో బ్లూ కలర్ జీన్స్‌లో సితార, పింక్ కలర్ స్వెటర్‌లో స్టైలీష్‌గా నమ్రత ఉన్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి ఇంకేందుకు ఆలస్యం .. మీరూ ఓ లుక్కేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X