సూపర్ స్టార్ రజని 'పెట్ట' ఆడియో రిలీజ్ డేట్ ఫిక్స్!

సూపర్ స్టార్ రజనీకాంత్ ఫ్యాన్స్ పండగ చేసుకునే రోజులు మొదలు కాబోతున్నాయి. నవంబర్ 29న దేశం మొత్తం ఎదురుచూస్తున్న 2.0 చిత్రం విడుదల కాబోతోంది. శంకర్ రూపొందిన ఈ విజువల్ వండర్ కోసం దేశ వ్యాప్తంగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉండగా రజనీకాంత్ ప్రస్తుతం కార్తీక్ సబ్బరాజ్ దర్శత్వంలో పెట్ట చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ చిత్రంలో రజని స్టైలిష్ లుక్ లో కనిపిస్తూ వయసులో 20 ఏళ్ళు వెనక్కి వెళ్లిపోయారు. ఫస్ట్ లుక్, ఇతర పోస్టర్స్ అభిమానులని ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ చిత్రం గురించి మరో అప్డేట్ వచ్చింది. పెట్ట చిత్ర ఆడియో రిలీజ్ కు ముహూర్తం కుదిరింది. ఈ చిత్ర ఆడియోని డిసెంబర్ 9న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.

Super Star Rajini Petta Audio release date fixed

అనిరుద్ రవిచంద్రన్ ఈ చిత్రానికి సంగీతం అడిస్తున్నాడు. త్రిష, సిమ్రాన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో రజనీకాంత్ ప్రొఫెసర్ పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ప్రస్తుతం అందరి చూపు రజని 2.0 చిత్రం పైనే. దాదాపు 600 కోట్ల బడ్జెట్ లో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X