రజనీకాంత్ 'పెట్ట' ట్రైలర్ లాంచ్ ఎప్పుడంటే!
సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న పెట్ట చిత్రం సంక్రాంతికి విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రచార కార్యక్రమాలు జోరందుకుంటున్నాయి. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొని ఉన్న సంగతి తెలిసిందే. రజనీకాంత్ ఇటీవల కాలంలో యంగ్ గా, స్టైలిష్ గా కనిపిస్తున్న చిత్రం ఇదే. రజని లుక్ కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఇటీవల విడుదలైన టీజర్ కూడా అభిమానులని అలరించింది.
కాగా పెట్ట ట్రైలర్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అభిమానుల నిరీక్షకు తెరపడే సమయం రాబోతోంది. డిసెంబర్ 28న పెట్ట థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేయనున్నారు. ఈ విషయాన్నీ చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ చిత్రం కోసం సంచలన సంగీత దర్శకుడు అనిరుద్ అందించిన పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది.

సూపర్ స్టార్ రజని ఈ చిత్రంలో ప్రొఫెసర్ పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. రజనీకాంత్ సరసన త్రిష, సిమ్రాన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సిమ్రాన్ చాలా కాలం తర్వాత ఈ చిత్రంతో రీఎంట్రీ ఇవ్వనుండడం విశేషం. తాజాగా చిత్ర యూనిట్ విడుదల చేసిన పోస్టర్ లో రజని ట్రెండీ డ్రెస్, చేతిలో పిస్టల్ తో కనిపిస్తున్నాడు. ఈ చిత్రంలో రజనీని చూస్తుంటే పాతరోజులు గుర్తొస్తున్నాయని అభిమానులు అంటున్నారు.


Click it and Unblock the Notifications











