Rajinikanth : అర్ధరాత్రి ఆసుపత్రిలో చేరిన రజనీకాంత్.. తలైవాకి ఏమైంది?
సౌతిండియన్ సూపర్‌స్టార్ రజనీకాంత్ ఆసుపత్రిలో చేరడంతో ఫిల్మ్ ఇండస్ట్రీ ఉలిక్కిపడింది. గుండెకు సంబంధించిన పలు వైద్య పరీక్షల నిమిత్తం సోమవారం చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో రజనీకాంత్ చేరారు. ఇంటర్‌వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ సాయి సతీష్ ఆధ్వర్యంలో వైద్యులు ఆయనకు పరీక్షలు చేశారు. ప్రస్తుతం రజనీకాంత్ ఆరోగ్య పరిస్ధితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. కాత్ ల్యాబ్‌లో రజనీకాంత్‌కు మంగళవారం కొన్ని టెస్టులు చేయాల్సి ఉందని సమాచారం. తలైవా ఆసుపత్రిలో చేరిన విషయం తెలుసుకున్న అభిమానులు, సినీ ప్రముఖులు ఉలిక్కిపడ్డారు. ఆయన త్వరగా కోలుకోవాలని పలువురు సోషల్ మీడియా ద్వారా ఆకాంక్షిస్తున్నారు.
రజనీకాంత్ నటించిన వెట్టయాన్ ది హంటర్ అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్‌లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. జై భీమ్ దర్శకుడు టీజే జ్ఞానవేల్ రాజా ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ప్రముఖ కోలీవుడ్ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ వెట్టయాన్‌ను భారీ బడ్జెట్‌తో నిర్మించింది. 2.0, దర్బార్, లాల్ సలామ్ వంటి సినిమాల తర్వాత రజనీ- లైకా ప్రొడక్షన్స్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న నాలుగో మూవీ వెట్టయాన్.

బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ ఈ సినిమాలో కీలకపాత్ర పోషిస్తున్నారు. దాదాపు మూడున్నర దశాబ్ధాల తర్వాత రజనీ- అమితాబ్‌లు స్క్రీన్ షేర్ చేసుకోవడం గమనార్హం. అనిరుధ్ రవిచంద్రన్ స్వరాలు సమకూర్చిన ఈ సినిమాలో ఫహద్ ఫాజిల్, రానా దగ్గుబాటి, మంజు వారియర్, రితికా సింగ్, దుషారా విజయన్, రోహిణి, రావు రమేశ్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. అమితాబ్ బచ్చన్‌కు విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ డబ్బింగ్ చెబుతుండటం విశేషం.
ఇటీవల చెన్నైలో వెట్టయాన్ ఆడియో, ప్రివ్యూ వేడుకను గ్రాండ్‌గా నిర్వహించగా.. అభిమానులు పోటెత్తారు. ఈ ఈవెంట్‌కు సంబంధించిన పాస్‌ల ఇష్యూ కారణంగా తలైవా ఫ్యాన్స్ ఇబ్బందులు పడ్డారు. పాస్‌ల విక్రయంపై తలెత్తిన సమస్యలపై స్వయంగా రజనీకాంత్ స్పందించారు. ఆడియో లాంచ్ సందర్భంగా ఎక్స్‌ట్రా పాస్‌లు అమ్మడం వల్ల ఫ్యాన్స్ ఇబ్బంది పడ్డారని సూపర్‌స్టార్ ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి పరిస్ధితులు ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకుంటామని ఆయన వివరణ ఇచ్చారు.
వెట్టయాన్‌తో పాటు కూలీ చిత్రంలో రజనీ నటిస్తున్నారు. ఇది ఆయన కెరీర్‌లో 171వ చిత్రం. ఈ సినిమాకు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తుండటంతో చిత్ర పరిశ్రమలో భారీ అంచనాలున్నాయి. ఈ మూవీకి గాను కనకరాజ్ ఏకంగా రూ.60 కోట్లకు పైగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లుగా కోలీవుడ్ వర్గాల టాక్. సన్ పిక్చర్స్ బ్యానర్ మీద కళానిధి మారన్ ఈ సినిమాను ఖర్చుకు వెనుకాడకుండా నిర్మిస్తున్నారు.
లియో లోకేష్‌ను బాగా డిజప్పాయింట్ చేసింది. దీంతో కూలీ విషయంలో ఆయన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. క్యాస్టింగ్ విషయంలోనూ సీరియస్‌గా ఉంటున్నారు లోకేష్ కనగరాజ్. ఇటీవల కన్నడ స్టార్ హీరో ఉపేంద్రను కూలీలోకి తీసుకుంటున్నట్లుగా ప్రకటించాడు. అలాగే టాలీవుడ్ అగ్ర కథానాయకుడు నాగార్జున ఇందులో సైమన్ అనే రోల్ పోషిస్తున్నారు. ఈ క్యారెక్టర్ ఏకంగా రజనీకాంత్‌ను ఢీకొట్టేలా ఉంటుందని , ఇద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు ఓ రేంజ్‌లో ఉంటాయని కోలీవుడ్ టాక్. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందని అంచనా.


Click it and Unblock the Notifications











