రజని ద్విపాత్రాభినయంలో నటిస్తున్నాడు.. కానీ ఆ పాత్ర చేయడం లేదు!

సూపర్ స్టార్ రజినీకాంత్ ఈ వయసులో కూడా వరుస చిత్రాలతో దూసుకుపోతున్నారు. గత ఏడాది రజిని కాలా, 2.0 చిత్రాలతో సందడి చేశారు. ఈ ఏడాది ఆరంభంలోనే కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో నటించిన పేట చిత్రం విడుదలయింది. ఇదిలా ఉండగా సంచలన దర్శకుడు ఏఆర్ మురుగదాస్ రజనీకాంత్ తో చిత్రానికి ప్లాన్ చేస్తున్నారు. గత ఏడాది మురుగదాస్ దర్శకత్వం వహించిన సర్కార్ చిత్రం రికార్డ్ వసూళ్లు రాబట్టింది.

రజనీకాంత్ తో మురగదాస్ తెరకెక్కించబోయే చిత్రం గురించి ఆసక్తికర వార్తలు వస్తున్నాయి. ఏ చిత్రంలో రజనీకాంత్ డ్యూయెల్ రోల్ లో నటించబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఓ పాత్రలో రాజకీయనాయకుడిగా కనిపిస్తారని అంటున్నారు. తాజాగా ఈ వార్తలు అవాస్తవం అని తేలింది. రజనీ ద్విపాత్రాభినయంలో నటించనుండడం వాస్తవమే. కానీ రాజకీయ నాయకుడి పాత్ర చేయడం లేదు. అది కేవలం పుకారు అని అంటున్నారు.

 Super star Rajinikanth playing dual roles in Murugadoss movie

ఓ పాత్రలో పోలీస్ అధికారిగా మరో పాత్రలో సామజిక సేవకుడిగా కనిపిస్తారని అంటున్నారు. 2.0 చిత్రాన్ని నిర్మించిన లైకా సంస్థే ఈ చిత్రాన్ని కూడా నిర్మిస్తోంది. అనిరుద్ ఈ చిత్రాన్ని సంగీతం అందిస్తున్నాడు. రజని, మురుగదాస్ తొలి కాంబోలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ఫ్యాన్స్ భారీగా ఆశలు పెట్టుకుని ఉన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X