టాలీవుడ్ మార్కెట్ కోసం రజినీకాంత్ న్యూ ప్లాన్.. పొంగల్ టార్గెట్!
కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ తెలుగులో సక్సెస్ చూసి చాలా కాలమవుతోంది. తమిళ్ లో కూడా గతంలో మాదిరిగా అయితే తలైవా బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడం లేదు. కేవలం ఓపెనింగ్స్ ద్వారానే తన క్రేజ్ ఇంకా ఉందని నీరూపించుకుంటున్నాడు. ఇక తెలుగు మార్కెట్ కోసం ఈ సారి రజినీకాంత్ స్పెషల్ ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది.
ఎలాగైనా నెక్స్ట్ సినిమాను వచ్చే ఏడాది పొంగల్ కి రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట. శివ దర్శకత్వంలో అన్నతే అనే సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే. అసలైతే రజినీకాంత్ ఇదే ఏడాది రెండు సినిమాను పూర్తి చేయాలని అనుకున్నాడు. కానీ కరోనా కారణంగా ఇప్పటికి కూడా ధైర్యంగా షూటింగ్స్ కి వెళ్లలేకపోతున్నారు. దర్శకుడు శివ ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ పూర్తి చేసినట్లు తెలుస్తోంది.

ఇక తెలుగులో 2021 సంక్రాంతికి ఎవరు వచ్చినా రాకపోయినా రజినీకాంత్ థియేటర్స్ లోకి రావాలని ఫిక్స్ అయ్యాడట. అందుకోసం ఒక స్టార్ ప్రొడ్యూసర్ హెల్ప్ కూడా తీసుకోబోతున్నాడట. ఇక సంక్రాంతి కోసం తెలుగులో ప్రభాస్ నుంచి మెగాస్టార్ వరకు చాలా మంది ఎదురుచూస్తున్నారు. కరోనా కంట్రోల్ అయితే తప్ప వారి సినిమాలు కూడా ఆ సమయానికి రాలేవు. ఇక రజినీకాంత్ మాత్రం ముందుగానే తమిళ్ తో పాటు తెలుగులో కూడా సంక్రాంతి రిలీజ్ డేట్స్ ని ఫిక్స్ చేసుకోవడానికి రెడీ అయ్యారని సమాచారం.


Click it and Unblock the Notifications











