మహేశ్ బాబు 50వ పుట్టిన రోజు.. బావ సుధీర్ బాబు ఆసక్తికరమైన కామెంట్స్

సూపర్ స్టార్ మహేశ్ బాబు పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు గ్రాండ్ గా సెలబ్రేషన్స్ జరుపుతున్నారు. సోషల్ మీడియా వేదికన బాబు పోస్టర్లను, హ్యాష్ ట్యాగ్ ను వైరల్ చేస్తున్నారు. ఇక మహేశ్ బాబు 50వ పుట్టిన రోజు కావడంతో మునుపటి కంటే మరింత గ్రాండ్ గా సెలబ్రేషన్స్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో మహేశ్ బాబుకు శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. ఇదే సమయంలో సుధీర్ బాబు ఇంట్రెస్టింగ్ గా బర్త్ డే విషెస్ తెలిపారు. ఆ వివరాల్లోకి వెళితే..

గ్రాండ్ గా మహేశ్ బాబు బర్త్ డే సెలబ్రేషన్స్..
సూపర్ స్టార్ మహేశ్ బాబు పుట్టిన రోజు సందర్భంగా సినీ ప్రముఖులు, స్టార్స్, సెలబ్రెటీస్ ఘనంగా శుభాకాంక్షలు తెలిపారు. ఇక అభిమానులకు ఈ రోజు అతడు రీ రిలీజ్ ఉండటంతో అక్కడే బాబు కటౌట్ ముందు కేక్ కట్ చేసి ఉత్సవాలు జరుపుతున్నారు. మహేశ్ బాబు 50వ ఏట అడుగుపెట్టిన సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున మహేశ్ బాబు బర్త్ డే పోస్టర్లను వైరల్ గా మారుస్తున్నారు.

Superstar Mahesh Babu 50th Birthday

సుధీర్ బాబు విషెస్..
50వ పుట్టిన రోజు సందర్భంగా మహేశ్ బాబుకు బావ సుధీర్ బాబు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఆసక్తికరంగా పోస్ట్ పెట్టారు. 'నా ప్రియమైన బావమరిది, గొప్ప సినిమాలు తీసినందుకు, మీ నాన్నగారి వారసత్వాన్ని గర్వంగా ముందుకు తీసుకెళ్లినందుకు, మా కుటుంబానికి బలమైన స్తంభంగా నిలిచినందుకు, ముఖ్యంగా నన్ను మరింత కష్టపడి పనిచేసేందుకు ఎప్పుడూ ప్రోత్సహిస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు.. అలాగే మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాను.' అని చెప్పుకొచ్చారు.

SSMB 29 సెట్స్ లో..
మహేశ్ బాబు పుట్టిన రోజు వేడుకల సందర్భంగా ఎస్ఎస్ఎంబీ29 సెట్స్ లోనూ సెలబ్రేషన్స్ ను నిర్వహించినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా మహేశ్ బాబు తన 50 పుట్టిన రోజు కేక్ ను కట్ చేస్తున్న ఫొటో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. దీంతో బాబు సెలబ్రేషన్స్ అన్ని చోట్లా బ్రహ్మాండంగా జరగడం విశేషం. మరోవైపు అతడు చిత్రం రీరిలీజ్ తోనూ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇండియాతో పాటు ఓవర్సీస్ లోనూ ఈ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద వసూళ్లు అందు తున్నాయి.

ఇక మహేశ్ బాబు పుట్టిన రోజు సందర్భంగా SSMB29 నుంచి ఏదైనా బిగ్ అప్డేట్, కనీసం బర్త్ డే పోస్టర్ అయినా వస్తుందనుకుంటే అలాంటిదేమీ రాలేదు. ఇక ఇప్పటి వరకు ఈ చిత్రానికి సంబంధించిన ఎలాంటి అప్డేట్స్ అయితే అందలేదు. షూటింగ్ మాత్రం కొనసాగుతోంది. ఎస్ఎస్ రాజమౌళి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై 1000 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తుండటం విశేషం. హీరోయిన్ గా గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా నటిస్తోంది. మలయాళం స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తుండటం విశేషం. 2027లో ప్రేక్షకుల ముందుకు రాబోతోందని తెలుస్తోంది.

More from Filmibeat

Read more about: mahesh babu ssmb 29 sudheer babu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X