సూపర్‌స్టార్ మహేష్ బాబు బాలీవుడ్ ఎంట్రీ.. దర్శకుడు ఎవరంటే..
ప్రిన్స్ మహేష్ బాబు బాలీవుడ్ ఎంట్రీ ఎన్నో ఏళ్లుగా వాయిదా పడుతూ వస్తున్నది. గతంలో స్పైడర్, తదితర చిత్రాల ద్వారా హిందీ చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించాలని అనుకొన్నారు. కానీ ఏవో కారణాల వల్ల కుదర్లేదు. అయితే ప్రస్తుతం సూపర్‌స్టార్ మహేష్ బాబు బాలీవుడ్ ఎంట్రీ పక్కాగా కనిపిస్తున్నది.
బాహుబలి తర్వాత జూనియర్ ఎన్టీఆర్, రాం చరణ్‌తో ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఆ చిత్రం తర్వాత మహేష్‌తో సినిమా చేయడం ఖారారైనట్టు మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. అయితే ఈ చిత్రం హిందీ, తెలుగు భాషల్లో రూపొందించనున్నట్టు సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. రాజమౌళి చెప్పిన పాయింట్ బాలీవుడ్‌కు సరిపడేలా ఉండటంతో ప్రిన్స్ మహేష్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది.

ప్రస్తుతం మహేష్ బాబు మహర్షి అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకుడు. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్‌లో విడుదల కానున్నది. పూజా హెగ్డే హీరోయిన్ కాగా, అల్లరి నరేష్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











