twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మహేష్ బాబు ఇంట తీవ్ర విషాదం.. సోదరుడు రమేష్ బాబు కన్నుమూత.. చివరిచూపుకు నోచుకోని విధంగా!

    |

    టాలీవుడ్ లో గత ఏడాది చాలా మంది సినీ నటులు, టెక్నీషియన్స్ ఇండస్ట్రీకి మాత్రమే కాక మొత్తంగా మానవాళికి దూరమైన సంగతి తెలిసిందే. ఇక ఈ కొత్త సంవత్సరంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆ వివరాలు...

    మహేశ్ బాబు ఇంట్లో విషాదం

    మహేశ్ బాబు ఇంట్లో విషాదం

    సూపర్ స్టార్ మహేశ్ బాబు ఇంట్లో విషాదం నెలకొంది. ఎవర్ గ్రీన్ సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు, యంగ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు అన్నయ్య అయిన ఘట్టమనేని రమేష్ బాబు శనివారం రాత్రి తన 56వ ఏట కన్ను మూశారు. కొద్ది కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న రమేష్ బాబు శనివారం తుదిశ్వాస విడిచారు. కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన శనివారం సాయంత్రం తీవ్ర అస్వస్థతకు గురయ్యారని తెలుస్తోంది. దీంతో కుటుంబ సభ్యులు హుటా హుటిన రమేష్ బాబును గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు.

    హాస్పిటల్ కి తీసుకుని వచ్చే లోపే

    హాస్పిటల్ కి తీసుకుని వచ్చే లోపే

    అయితే రమేష్ బాబు ని హాస్పిటల్ కి తీసుకుని వచ్చే లోపే మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో ఒక్కసారిగా సూపర్ స్టార్ మహేష్ బాబు కుటుంబం అంతా విషాదంలో మునిగిపోయింది. సూపర్ స్టార్ కృష్ణకు ఐదుగురు సంతానం కాగా అందులో రమేష్ బాబు, మహేష్ బాబు ఇద్దరు కుమారులు. మంజుల, పద్మావతి, ప్రియదర్శిని కుమార్తెలు. రమేష్ బాబు తొలుత హీరోగా కొన్ని సినిమాలు చేసిన తర్వాత నిర్మాతగా స్థిరపడ్డారు. మరో పక్క మహేష్ బాబు ఇప్పుడు టాలీవుడ్ లోనే టాప్ హీరోగా కొనసాగుతున్నారు.

    మొత్తం ఐదుగురు సంతానం

    మొత్తం ఐదుగురు సంతానం

    మంజుల నటుడు నిర్మాత సంజయ్ స్వరూప్ వివాహమాడగా, పద్మావతి గల్లా జయదేవ్ వివాహమాడారు. వీరి కుమారుడు గల్లా అశోక్ 'హీరో' సినిమాతో సంక్రాంతి రేసులోకి దిగారు. ఈ సినిమా జనవరి 15వ తేదీన రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా పెద్ద ఎత్తున విడుదల చేస్తున్నారు. ఈ సినిమాకు ముందు నుంచి కూడా మహేష్ బాబు సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. మరో కుమార్తె ప్రియదర్శిని హీరో సుధీర్ బాబుని వివాహమాడారు.

    సినీ ఎంట్రీ

    సినీ ఎంట్రీ

    1974లో 'అల్లూరి సీతారామరాజు' చిత్రంతో సినీ ఎంట్రీ ఇచ్చిన రమేష్ బాబు ఆ తరువాత పలు చిత్రాల్లో బాలనటుడిగా నటించారు. తరువాత సామ్రాట్ అనే సినిమాతో హీరోగా మారిన ఆయన హీరోగా మొత్తం 13 సినిమాలు చేశారు. తన కెరీర్ మొత్తం మీద 19 సినిమాలలో నటించిన ఆయన 1997లో నటనకు గుడ్బై చెప్పారు. అలాగే కృష్ణ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో పలు చిత్రాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు. తన తమ్ముడు మహేశ్ బాబు హీరోగా నటించిన అర్జున్, అతిథి చిత్రాలను రమేష్ బాబు నిర్మించారు.

    కరోనాతో మహేష్

    కరోనాతో మహేష్


    అలాగే దూకుడు, ఆగడు సినిమాలకు రమేశ్‌ బాబు సమర్పకుడిగా వ్యవహరించారు. ఇక రమేష్ మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘట్టమనేని రమేష్ బాబు భార్య పేరు మృదుల ఘట్టమనేని కాగా, వారికి భారతి అనే కుమార్తె జై కృష్ణ అనే కుమారుడు ఉన్నారు. అయితే ప్రస్తుతానికి మహేష్ బాబు కరోనా సోకి ఐసోలేషన్ లో ఉన్న కారణంగా ఆయన తన సోదరుడిని కడసారి చూసేందుకు కూడా అవకాశం లేకుండా పోయిందని కొందరు బాధ పడుతున్నారు. ఈ మధ్యనే తన భార్యను పోగొట్టుకున్న కృష్ణ ఇప్పుడు తన కుమారుడు మృతితో మరింత బాధ పడుతున్నారు.

    English summary
    superstar Mahesh Babu elder brother Ramesh Babu passed away. సూపర్ స్టార్ మహేష్ బాబు అన్నయ్య రమేష్ బాబు కన్నుమూశారు.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X