మహర్షి విడుదల మళ్ళీ వాయిదా.. కారణం ఇదే!

సూపర్ స్టార్ మహేష్ నటిస్తున్న తాజా చిత్రం మహర్షి. రైతు సమస్యల నేపథ్యంలో ఈ చిత్రం ఉండబోతోంది. వంశీ పైడిపల్లి దర్శత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. అశ్విని దత్, దిల్ రాజు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పూజ హెగ్డే మహేష్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం దర్శకుడు వంశీ పైడిపల్లి చిత్రంలో అంత్యత కీలకమైన ఫైట్స్ సీన్ చిత్రీకరణ జరుపుతున్నాడు. రామోజీ ఫిలిం సిటీలో జరుగుతున్న ఈ షూటింగ్ లో మహేష్ బాబు బిజీగా పాల్గొంటున్నాడు.

ఈ చిత్ర విడుదల గురించి మరోసారి ఆసక్తికర వార్తలు వస్తున్నాయి. మహర్షి సినిమా మళ్ళీ వాయిదా పడే అవకాశాలు ఉన్నాయట. మహర్షి చిత్రాన్ని ముందుగా ఏప్రిల్ 5న విడుదల చేయాలని భావించారు. షూటింగ్ ఆలస్యం కావడంతో విడుదల తేదీని ఏప్రిల్ 25కు మార్చారు. తాజా సమాచారం ప్రకారం ఈ తేదీ కూడా వాయిదా పడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

 SuperStar Maheshs Maharshi movie to postpone again

మహర్షి చిత్రానికి సంబంధించి ఇంకా 30 రోజుల షూటింగ్ జరపాల్సి ఉందట. దీనికి తోడు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఎలాగు ఉన్నాయి. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న చిత్రం కాడంతో అన్ని పక్కాగా చిత్రీకరించేటప్పటికీ ఇంకాస్త ఎక్కువ సమయం కూడా పట్టొచ్చు. ఏది ఏమైనా మహర్షి చిత్రం విడుదల ఎప్పుడనేది చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటిచాల్సి ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X