మరోసారి హాస్పిటల్ లో చేరిన రజనీకాంత్.. అభిమానుల్లో కన్ఫ్యూజన్.. ఏం జరిగిందంటే?
సూపర్ స్టార్ రజనీకాంత్ మరోసారి హాస్పిటల్లో జాయిన్ అయినట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా రజనీకాంత్ ఎక్కువగా ఆసుపత్రికి అవుతుండడంతో ఓ వర్గం అభిమానుల్లో ఆందోళన నెలకొంది. అయితే ఎప్పటికప్పుడు మాత్రం ఆయన కుటుంబ సభ్యులు ఆరోగ్య పరిస్థితి పై వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. రజినీకాంత్ రెగ్యులర్ చెకప్ కోసం వెళ్తున్నట్లు చెబుతూ.. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అంటున్నారు. ఇక సోషల్ మీడియాలో మాత్రం కొన్ని రూమర్స్ ఎప్పటిలానే కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నాయి. ఇక మరోసారి తలైవా చెన్నైలోని కావేరి హాస్పిటల్ లో జాయిన్ అయినట్టు తెలుస్తోంది. అసలు ఏం జరిగింది అనే వివరాల్లోకి వెళితే..

మంచి మనిషిగా..
సూపర్ స్టార్ రజినీకాంత్ అంటే తెలియని సినీ ప్రేమికులు ఉండరు. దాదాపు అన్ని భాషల్లో కూడా ఆయన సుపరిచితులు. విదేశాల్లో కూడా ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ ను క్రియేట్ చేసుకున్నాడు. ఇక ఇండియన్ సూపర్ స్టార్ గా కూడా ఒక ప్రత్యేకమైన స్టార్ హోదాను సంపాదించుకున్నారు. సినిమా హీరోగానే కాకుండా మంచి మనిషిగా కూడా ఎన్నోసార్లు మానవత్వాన్ని చాటుకున్నారు. అందుకే రజినీకాంత్ అంటే అన్ని వర్గాల ప్రేక్షకులు ఎంతగానో ఇష్టపడుతుంటారు. ఇక ఆయన అనారోగ్యంతో హాస్పిటల్లో జాయిన్ అయిన ప్రతిసారీ కూడా పెద్ద సంఖ్యలో అభిమానులు ఆయనను కలిసేందుకు ప్రయత్నం చేస్తుంటారు.

వెనక్కి తగ్గిన తలైవా
కొన్ని నెలల క్రితం రజినీకాంత్ ఆరోగ్యం బాగా లేకపోవడంతో అమెరికాకు వెళ్లి ట్రీట్మెంట్ కూడా తీసుకున్నట్లు కథనాలు వెలువడ్డాయి. సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలు కూడా అప్పట్లో వైరల్ అయ్యాయి. అయితే అంతకు ముందు రాజకీయాల్లోకి రానున్నట్లు నిర్ణయం తీసుకున్న తలైవా హెల్త్ కండిషన్ ను దృష్టిలో ఉంచుకొని అటువైపు వెళ్ళకుండా మళ్ళీ వెనక్కి తగ్గాల్సి వచ్చింది. తప్పకుండా రాజకీయాల్లోకి రావాలని అనుకున్న సూపర్ స్టార్ వెనక్కి తగ్గడం అభిమానులకు ఆశ్చర్యాన్ని కలిగించింది.

కంగారు పడాల్సిన అవసరం లేదు..
కానీ రజనీకాంత్ అనారోగ్య కారణాలతో రాజకీయాల్లోకి రాకుండానే రిటైర్మెంట్ ఇచ్చేశారు. అయితే కొద్ది గంటల క్రితం కావేరి హాస్పటల్ లో చేరినట్లు అనేక రకాల వార్తలు రావడంతో అభిమానులను కొంత ఆందోళనకు గురి చేశాయి. మొదట ఎవరు కూడా సరైన క్లారిటీ ఇవ్వకపోవడంతో పలు రూమర్స్ కూడా వచ్చాయి. ఫైనల్ గా రజినీకాంత్ సన్నిహితులను సంప్రదించగా కంగారు పడాల్సిన అవసరం లేదని వారు తెలియజేశారు.

సాధారణ చేకప్స్ కోసమే..
సూపర్ స్టార్ రజనీకాంత్ కేవలం రెగ్యులర్ చెకప్ కోసమే కావేరి హాస్పిటల్ కు వెళ్ళినట్లుగా తెలుస్తోంది. సాధారణ చేకప్స్ కోసమే ప్రతి సంవత్సరం కూడా హాస్పిటల్లో జాయిన్ అవుతూ ఉంటారు. ఇటీవల కూడా అదే తరహాలో వైద్యుల నుంచి పిలుపు రావడంతో ఆయన మరొకసారి వెళ్లినట్లు తెలుస్తోంది. ఇక రజనీకాంత్ శుక్రవారం రోజు డిస్చార్జ్ అవుతారని కూడా తెలియజేశారు.
Recommended Video

పెద్దన్న గ్రాండ్ రిలీజ్
ఇక రజనీకాంత్ నుంచి నెక్స్ట్ అన్నత్తై అనే సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అభిమానుల్లో అంచనాలు గట్టిగానే ఉన్నాయి. తెలుగులో పెద్దన్న అనే టైటిల్ తో అనువాదం అయ్యింది. తెలుగులో కూడా ఈ సినిమా పై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇటీవల విడుదలైన టీజర్ ట్రైలర్ కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేశాయి. మరి నవంబర్ 4న రానున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











