మళ్ళీ వెనుకడుగు వేసిన రజినీకాంత్.. రాజకీయాలకు దూరంగా.. షాకింగ్ నిర్ణయం

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ మరోసారి అభిమానులకు పెద్ద షాక్ ఇచ్చాడనే చెప్పాలి. తమిళనాడు రాజకీయాల్లో కొత్త అధ్యాయం మొదలు పెట్టాలని అనుకున్న సూపర్ స్టార్ మళ్ళీ వెనుకడుగు వేయడం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. రజినీకాంత్ పాలిటిక్స్ లోకి రావాలని ఎంతోమంది అభిమానులు కోరుకుంటున్న విషయం తెలిసిందే. ఇక ఇటీవల సోషల్ మీడియాలో ఆయన ఒక పోస్ట్ ద్వారా మళ్ళీ షాక్ ఇచ్చారు.

డిసెంబర్ 31.. అన్ని ఏర్పాట్లు పూర్తి..

డిసెంబర్ 31.. అన్ని ఏర్పాట్లు పూర్తి..

రజినీకాంత్ రాజకీయాల్లోకి రాలేను అని ఏనాడు చెప్పలేదు. తన నుంచి ప్రజలకు ఏదైనా మంచి చేయాలని ఉందని ఏదో ఒకరోజు తాను అనుకున్న పనిని పూర్తి చేయడానికి రెడీ అవుతానని చెబుతూ వస్తున్నాడు. అయితే ఇటీవల డిసెంబర్ 31న పార్టీ పేరును ప్రకటిస్తాను అంటూ తలైవా ఒక స్టేట్మెంట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఆయన సన్నిహితులు అన్ని ఏర్పాట్లు చేశారు కూడా.

డిసెంబర్ 31న పార్టీ ప్రకటన లేదంటూ

డిసెంబర్ 31న పార్టీ ప్రకటన లేదంటూ

అయితే అన్ని ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో రజినీకాంత్ ఇప్పుడు మళ్లీ వెనుకడుగు వేశారు. మరికొంత కాలం రాజకీయాలకు దూరంగా ఉండబోతున్నట్లు సోషల్ మీడియా ద్వారా ఒక ప్రకటనను విడుదల చేశారు. డిసెంబర్ 31న పార్టీ ప్రకటన లేదంటూ ప్రకటన ఇచ్చే సరికి అభిమానులు అందరూ కూడా ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు.

70 ఏళ్ళ వయసులో ఆ ఆలోచనల వల్ల..

ఇటీవల తలైవా కొంత అనారోగ్యానికి గురైన విషయం తెలిసిందే. అన్నాతే షూటింగ్ ను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని రోజుకు 14గంటలు పని చేయాలని అనుకున్నారు. ఒకవైపు పార్టీ ఆలోచనలో మరోవైపు సినిమా పనుల వల్ల 70ఏళ్ల రజినీకాంత్ కొంత అస్వస్థతకు గురి కావాల్సి వచ్చింది. ఇక హాస్పిటల్ చికిత్స తీసుకొని మళ్ళీ ఇంటికి ఆరోగ్యంగా చేరుకున్నారు.

కుటుంబ సభ్యులతో చర్చల.. కారణం అదేనా

కుటుంబ సభ్యులతో చర్చల.. కారణం అదేనా

అయితే అనారోగ్య కారణాల దృష్టి లో వుంచుకుని పాలిటిక్స్ కి నో చెప్పినట్లు తెలుస్తోంది. నిన్న సాయంత్రం కుటుంబ సభ్యులతో కలసి రాజకీయ ఆరంగేట్రంపై సుదీర్ఘంగా చర్చించినట్లు టాక్ వస్తోంది. కూతుళ్ళు కుటుంబ సభ్యులు అలాగే సన్నిహితులు చాలా వరకు ఆయన ఈ వయసులో రాజకీయాలకు దూరంగా ఉంటేనే మంచిదని చెప్పినట్లు సమాచారం. మరి ఈ విషయంలో అభిమానులకు రజినీకాంత్ ఎలాంటి వివరణ ఇస్తారో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X