33 ఏళ్ల తర్వాత అమితాబ్‌తో రజనీకాంత్.. నా గురువు, లెజెండరీ బిగ్ బీ అంటూ తలైవా ఎమోషనల్!
సూపర్ స్టార్ రజనీకాంత్ వరుస సినిమాలు, విజయాలతో దూసుకెళ్తున్నారు. జైలర్ చిత్రంతో తన కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన ఘనతను తన ఖాతాలో వేసుకొన్నారు. అదే జోష్‌తో తన సినిమా కెరీర్‌లో 170వ సినిమాను పట్టాలెక్కించారు. అయితే ఈ సినిమాలో బిగ్‌బీ, బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్‌తో కలిసి నటించడంపై ఎమోషనల్ అయ్యారు. అమితాబ్‌తో కలిసి షూటింగులో తీసుకొన్న ఫోటోను షేర్ చేశారు. ఈ సినిమాకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..
ఇండియన్ సూపర్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, రజనీకాంత్ పలు హిందీ సినిమాల్లో నటించారు. ఆఖరీ రస్తా నుంచి హమ్ సినిమా వరకు కొన్ని సినిమాల్లో కనిపించారు. వారిద్దరు కలిసి నటించిన హమ్ చిత్రం భారీ విజయం సాధించింది. ఆ తర్వాత వారిద్దరు కలిసి నటించిన దాఖలాలు లేవు. తాజాగా తన 170వ సినిమా కోసం మళ్లీ కలిసి నటిస్తున్నారు.

ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న తలైవర్ 170 సినిమాలో కీలక పాత్రను అమితాబ్ బచ్చన్ పోషిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ తిరున్నవేళి, కోయంబత్తూరులో తొలి షెడ్యూల్‌ను పూర్తి చేసుకొన్నది. ప్రస్తుతం మరో షెడ్యూల్‌ను ముంబైలో ప్రారంభించారు. ఈ షెడ్యూల్‌లో బిగ్ బీ పాల్గొన్నారు.
ముంబైలో జరుగుతున్న షూటింగ్ కోసం అమితాబ్ రాగానే సాదారంగా రజనీకాంత్ ఆహ్వానించారు. బిగ్‌బీతో ఫోటో దిగిన తలైవా వెంటనే ఆ ఫోటోను తన ట్విట్టర్‌లో షేర్ చేశారు. 33 ఏళ్ల తర్వాత నా గురువు, లెజెండరీ యాక్టర్ అమితాబ్‌తో కలిసి నటిస్తున్నాను. ఈ సినిమాను లైకా నిర్మిస్తున్నది. టీజే జానవేల్ దర్శకత్వం వహిస్తున్నారు అని తెలిపారు. అమితాబ్‌తో కలిసి నటించడంపై సంతోషాన్ని వ్యక్తం చేశారు.
తలైవా10 చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో రానా దగ్గుబాటి, ఫహాద్ ఫాజిల్, మంజు వారియర్, రితికా సింగ్, దుషరా విజయన్, జీఎం సుందర్ తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాను త్వరలోనే ప్రేక్షకలు ముందుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.


Click it and Unblock the Notifications











