Surekha Vani: నా సర్వస్వం నువ్వే అమ్మా... తల్లిని హత్తుకుని సుప్రీత భావోద్వేగం
క్యారెక్టర్ ఆర్టిస్టుగా పీక్స్ చూశారు సురేఖవాణి. ఇప్పుడంటే హీరోయిన్లే అక్క, అమ్మ, అత్త క్యారెక్టర్లు చేస్తున్నారు కానీ.. గతంలో వీటికంటూ ప్రత్యేకంగా సురేఖవాణి, సుధ, హేమ, ప్రగతి వంటి నటీమణులు ఉండేవారు. హీరోయిన్లు రీ ఎంట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మారిపోతుండటంతో ఇలాంటి వారికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇక సురేఖవాణి విషయానికి వస్తే ఎలాంటి పాత్రలోనైనా అవలీలగా ఒదిగిపోతారు. కామెడీతో నవ్వించగలరు.. సెంటిమెంట్ రోల్స్‌లో ఏడిపించగలరు అన్న గుర్తింపు తెచ్చుకున్నారు.
విజయవాడకు చెందిన సురేఖవాణి.. తొలుత యాంకరింగ్‌లో అడుగుపెట్టారు. అప్పట్లో మా టీవీలో ప్రసారమైన మొగుడ్స్ - పెళ్లామ్స్ సినిమాకు యాంకర్‌గా పనిచేసి ఫేమస్ అయ్యారు. ఈ కార్యక్రమానికి సురేఖ వాణి భర్త దర్శకత్వం వహించారు. ఆ తర్వాత సురేఖ వాణికి సినీరంగం నుంచి అవకాశాలు వెల్లువెత్తాయి. అన్ని రకాల పాత్రలు చేస్తూ.. తన కామెడీ టైమింగ్‌తో నవ్వించారు సురేఖ. కెరీర్ పీక్స్‌లో ఉన్న దశలో సురేఖవాణి భర్త మరణించడంతో ఆమె డిప్రెషన్‌లోకి వెళ్లిపోయారు. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సహకారంతో కోలుకున్న ఆమె.. సినిమాలను బాగా తగ్గించి కూతురు సుప్రీతను పెంచి పెద్ద చేశారు.

ట్రోలింగ్‌పై సురేఖవాణి వార్నింగ్
సుప్రీత - సురేఖలు తల్లీకూతుళ్లలా కాకుండా స్నేహితుల్లా ఉంటారు. వీరిద్దరి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. పలుమార్లు వీరిపై నెట్టింట్లో ట్రోలింగ్ జరగ్గా.. దానికి ఇద్దరూ దిమ్మతిరిగేలా కౌంటర్ ఇచ్చేవారు. ఒంటరి మహిళగా కూతురిని పెంచడం ఎంతో కష్టమని.. మొగుడు పోయిన తర్వాత విచ్చలవిడిగా తిరుగుతున్నారంటూ నన్ను, నా బిడ్డను ట్రోల్ చేశారు. మొదట్లో ఈ కామెంట్స్ చూసి భరించలేకపోయాను. తర్వాత మనం ఏం చేసినా వీళ్లు మారరని వదిలేశానని సురేఖవాణి పలుమార్లు ఆవేదన వ్యక్తం చేశారు.
అమ్మను ఒంటరి వదలను
ఇక తల్లిని జాగ్రత్తగా చూసుకుంటూ, కాపాడుకుంటూ వస్తోంది కూతురు సుప్రీత. నేను పెళ్లి చేసుకునేలోగా అమ్మకు జీవితంలో ఒక మంచి తోడు ఉండాలి. ఆమెను ప్రేమగా చూసుకునే .. గౌరవించే వ్యక్తి రావాలని సుప్రీత చెప్పింది. కుటుంబ సభ్యులతో కూడా చర్చించానని.. వారు కూడా నా అభిప్రాయానికి మద్ధతు తెలిపారని సుప్రీత తెలిపింది. కానీ నాన్న స్థానాన్ని మరొకరికి ఇవ్వడానికి అమ్మ సిద్ధంగా లేరు. అమ్మని ఇబ్బందిపెట్టను.. కానీ ఆమె ఒంటరిగా ఉండకూడదని కోరుకుంటున్నానని సుప్రీత చెప్పింది.
నాకు అన్నీ నువ్వే
ఏప్రిల్ 29న సురేఖ వాణి పుట్టినరోజు. ఈ సందర్భంగా తల్లి బర్త్ డే వేడుకలను ఘనంగా నిర్వహించింది సుప్రీత. ఇంట్లోనే కేక్ కట్ చేయించి తల్లి పుట్టినరోజును మెమరబుల్‌గా మార్చింది. హ్యాపీ బర్త్ డే మమ్మీ.. నాకు సర్వస్వం నువ్వే.. నిన్ను చాలా ప్రేమిస్తున్నా అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. అలాగే తన పెంపుడు కుక్కపిల్ల, ఇంట్లో పెంచుకుంటున్న లేగదూడతో సురేఖ, సుప్రీతలు ఫోటోలు దిగారు. దీనికి సంబంధించిన ఫోటోలను సుప్రీత తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతుండగా... సురేఖవాణికి అభిమానులు, సినీ ప్రముఖులు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు.


Click it and Unblock the Notifications