మనల్ని ఎవడ్రా ఆపేది.. సురేఖావాణి కూతురు సుప్రీత రచ్చ
తెలుగు నటి సురేఖావాణి గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఆమె ఎన్నో మంచి సినిమాల్లో నటించి మెప్పించింది. ఇక సినిమాల్లో ఎంతో పద్దతిగా ఉండే సురేఖావాణి సోషల్ మీడియాలో చేసే రచ్చ అంతా ఇంతా కాదు. చిట్టిపొట్టి బట్టలు వేసుకొని అందాల ఆరబోత చేస్తూ కుర్రాళ్లను కిర్రెక్కిస్తూ ఉంటుంది.
ఇక భర్త చనిపోయాక అమ్మడి ఆగడాలు మరింత ఎక్కువ అయ్యాయి. కూతురు సుప్రీతతో కలిసి రీల్స్ చేస్తూ కనిపించడం మొదలుపెట్టింది. ఈ తల్లీకూతుళ్లు చేసే రచ్చకు విమర్శలు మాములుగా లేవు. వెకేషన్స్, టూర్లు, కార్లు అంటూ ఎప్పుడు ఎక్కడో ఒకచోట కనిపిస్తూనే ఉంటారు. ఇక ఈ మధ్యకాలంలో సురేఖావాణి కొద్దిగా అందాల ఆరబోతను తగ్గించింది.

కొన్ని నెలల క్రితం గుండు చేయించుకున్న ఆమె.. సినిమాల్లో కూడా కనిపించకుండా ఇంట్లో రెస్ట్ తీసుకుంటుంది. ఇక తనకున్న కాంటాక్ట్స్ తో కూతురు సుప్రీతను హీరోయిన్ గా చేయడానికి ప్రయత్నాలు చేస్తుంది. తల్లిని మించిన అందం సుప్రీత సొంతం. ఎప్పుడు క్లివేజ్ షోతో కుర్రాళ్లను కట్టిపడేసే సుప్రీత.. అప్పుడప్పుడు చీరకట్టులో కూడా కనిపించి ఫిదా చేస్తూ ఉంటుంది.
ఈ మధ్యకాలంలో ఈ తల్లీకూతుళ్ల హంగామా కొంచెం తగ్గింది. అందుకు కారణం వీరిద్దరి పేర్లు డ్రగ్స్ కేసులో రావడమే. ఆ ఆరోపణలు నిజం కాదని సురేఖావాణి ఒక వీడియో ద్వారా తెలిపింది. ఇకపోతే సురేఖావాణి, సుప్రీతకు పవన్ కళ్యాణ్ అంటే బాగా ఇష్టం. ఈ విషయాన్నీ వారు ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఎవరినైనా ముద్దుపెట్టుకోవాలి అంటే పవన్ కళ్యాణ్ కు పెడతానని సురేఖ ఇంటర్వ్యూలో తెలిపింది.ఆయన అంటే అంత ఇష్టమని కూడా తెలిపింది.
ఇక నిన్న పిఠాపురంలో జనసేన గెలవడంతో ఈ తల్లీకూతుళ్లు మరోసారి రచ్చ చేశారు. ముఖ్యంగా సుప్రీత అయితే పవన్ కళ్యాణ్ మనల్ని ఎవడ్రా ఆపేది అనే మ్యాషప్ సాంగ్ పెట్టుకొని.. జనసేన టీ షర్ట్ వేసుకొని డ్యాన్స్ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
అసలు జనసేన గెలిచిన ఆనందం మొత్తం వీరి ముఖాల్లోని కనిపిస్తుంది. సుప్రీత.. ఏకంగా టపాసులు కాలుస్తూ.. వీధుల్లో జనసేన జెండాతో దర్శమిచ్చింది. పవన్ కళ్యాణ్ గెలిచినందుకు సంతోషంగా ఉందని తెలిపింది. ఇక సుప్రీత కెరీర్ విషయానికొస్తే.. ఒక రెండు షార్ట్ ఫిల్మ్స్ లో నటించిన ఆమె.. తాజాగా ఒక సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.
బిగ్ బాస్ తో పేరు తెచ్చుకున్న అమర్ దీప్ చౌదరి హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా సుప్రీత నటిస్తోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే రిలీజ్ కు సిద్దమవుతుంది. మరి ఈ సినిమాతో సుప్రీత ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications










