కలిసే పార్టీలకు, పబ్‌లకు వెళ్తాం..సినిమాల్లోకి ఎంట్రీ.. కూతురి గురించి సురేఖావాణి కామెంట్స్
టాలీవుడ్ ఆర్టిస్ట్‌లో ఎమోషన్స్, కామెడీ, విలనిజం ఇలా ప్రతీ క్యారెక్టర్‌ను పోషించే నటీమణులెంతో మంది ఉన్నారు. అయితే లేడీ కమెడియన్‌గా మాత్రం తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకుని తెలుగు ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసింది సురేఖా వాణి. హాస్య భరిత చిత్రాల్లో ఎక్కువగా సందడి చేసే సురేఖా.. ఈ మధ్య కాస్త సినిమాలకు దూరంగా ఉంటోంది. అదే సమయంలో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉంటుంది. కూతురితో కలిసి సోషల్ మీడియాను ఊపేస్తోన్న సురేఖా తన కూతురితో కలిసి.. తాజాగా మాతృదినోత్సవం సందర్భంగా ఓ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూలో వారిద్దరు అనేక విషయాలన వెల్లడించారు. అవేంటో ఓ సారి చూద్దాం.
Recommended Video

గౌరవం ద్వారా పొందే భయం..
తన పేరెంట్స్ చాలా స్వేచ్ఛగా పెంచారని.. అమ్మ చాలా ఫ్రెండ్లీగా ఉండేదని సురేఖావాణి చెప్పుకొచ్చింది. ఏదైనా సరే పంచుకునే చనువు తన అమ్మతో ఉండేదని తెలిపింది. ప్రస్తుతం తన కూతురుతో కూడా అలాగే ఉంటున్నానని పేర్కొంది. బెదిరింపులు హెచ్చరికల ద్వారా వచ్చే భయం కన్నా గౌరవం ద్వారా పొందే భయం ఉండాలనేది తన అభిప్రాయమని వెల్లడించింది.

ఇద్దరం కలిసే వెళ్తాం..
చిన్నప్పటి నుంచీ ఎలాంటి అరమరికలు లేకుండా ఉండేలా అలవాటు చేశానని తెలిపింది. ఇద్దరం కలిసే షాపింగ్స్‌కి, టూర్స్‌కి, మూవీస్‌కి, పార్టీస్‌కి, పబ్స్‌కి వెళతామని చెప్పుకొచ్చింది. తనకూ డ్యాన్స్ బాగా ఇష్టమని.. అందుకని అప్పుడప్పుడు ఇద్దరం చేసేవాళ్లమని పేర్కొంది.

తనకిష్టమైతే కాదనను..
ఒకసారి అలా చేసిన డ్యాన్స్ సరదాగా యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తే బాగా వైరల్ అయింది అప్పటి నుంచి ఖాళీ దొరికనప్పుడల్లా డ్యాన్సుల వీడియోలు, టిక్‌టాక్ కలిసి చేస్తున్నామని తెలిపింది. అయితే అవేవీ ప్లాన్ వేసుకుని చేస్తున్నవి కాదని, స్పాంటేనియస్‌గా చేస్తున్నవి మాత్రమేనని తెలిపింది. తనను సినిమాలకు పరిచయం చేయాలనే ఆసక్తి లేదని, ఒకవేళ తనకు ఇష్టం ఉంటే కాదనని తెలిపింది.

అమ్మతో అంతకన్నా బాగుంటా
మామ్‌ను మించిన ఫ్రెండ్ తనకు ఇంకెవరూ లేరని సురేఖా వాణి కూతురు సుప్రిత చెప్పుకొచ్చింది.. ఫ్రెండ్స్‌తో ఎంత బాగుంటానో అమ్మతో అంతకన్నా బాగుంటానని తెలిపింది. తనెప్పుడూ నాకు అది చేయ్.. ఇది చేయెద్దు.. అని చెప్పలేదు. షార్ట్ ఫిలిమ్స్, వెబ్‌సిరీస్, మ్యూజిక్ వీడియోలు చేస్తున్నా. సినిమాల్లో కొందరు అడిగారు. అయితే మంచి పాత్రలైతే చేద్దామని ఉంది.


Click it and Unblock the Notifications











