కాబోయే భర్తపై క్లారిటీ ఇచ్చిన సురేఖా వాణి కూతురు.. పెళ్లి ఎప్పుడంటే?

సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఒక డిఫరెంట్ క్రేజ్ అందుకుంటున్న సురేఖ వాణి కేవలం టాలీవుడ్ లోనే కాకుండా కోలీవుడ్ లో కూడా మంచి గుర్తింపు అందుకుంటోంది. ఆమె చేసేది చిన్న పాత్రలే అయినా మంచి రోల్స్ తో ప్రేక్షకులకు అంతకంతకు దగ్గరవుతోంది. సోషల్ మీడియా ప్రభావం వీరిపై చాలానే ఉంది. ఆమెతో పాటు కూతురు సుప్రీత కూడా మంచి క్రేజ్ అందుకుంటోంది. ఇక ఇటీవల సుప్రీత తన పెళ్లి పై ఒక క్లారటీ అయితే ఇచ్చేసింది.

 స్టార్ హీరోలందరితో..

స్టార్ హీరోలందరితో..

సురేఖ వాణి దాదాపు స్టార్ హీరోలందరి సినిమాల్లో స్క్రీన్ షేర్ చేసుకుంది. ఎక్కువగా మదర్, సిస్టర్, వదిన వంటి సపోర్టింగ్ క్యారెక్టర్స్ లో కనిపించిన ఈ నటిమణి వెండితెరపై ఎంత చురుగ్గా కనిపిస్తుందో అదే తరహాలో నిజ జీవితంలో కూడా ఎంజాయ్ చేస్తుంటుంది. ఇటీవల ఆమె సెకండ్ మ్యారేజ్ రూమర్స్ ఏ రేంజ్ లో వైరల్ అయ్యాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు.

గ్లామరస్ బ్యూటీలకు పోటీగా

గ్లామరస్ బ్యూటీలకు పోటీగా

సురేఖ వాణి ఇన్స్టాగ్రామ్ లో తన ఫాలోవర్స్ సంఖ్యను రోజురోజుకు మరింత పెంచుకుంటున్నారు. ఆమె పోస్ట్ చేస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో బాగానే ట్రెండ్ అవుతున్నాయి. నేటితరం గ్లామరస్ బ్యూటీలకు ఏ మాత్రం తీసిపోని విధంగా సూరేఖావాని తన అందంతో ఎంతగానో ఎట్రాక్ట్ చేస్తోంది.

నా పిచ్చిని మొత్తం భరించాలి

నా పిచ్చిని మొత్తం భరించాలి

ఇక ఆమెతో కూతురు సుప్రీత కూడా తన ఫాలోవర్స్ సంఖ్యను గట్టిగానే పెంచుకుంటోంది. ఇటీవల ఆమె తనకు కాబోయే భర్త ఎలా ఉండాలి అని విషయంపై ఒక క్లారిటీ అయితే ఇచ్చింది. వీలైనంత వరకు నేను ఎలా ఉన్నా కూడా ప్రేమగా ఉండాలి అని ఒక్క ముక్కలో చెప్పాలి అంటే నా పిచ్చిని మొత్తం భరించాలి అంటూ అంత కంటే మరేమీ అవసరం లేదని కూడా వివరణ ఇచ్చింది..

Recommended Video

Actress Surekha Vani Panchekattu Video Goes Viral
మూడేళ్ళ అనంతరం పెళ్లి

మూడేళ్ళ అనంతరం పెళ్లి

ఇక పెళ్లి ఎప్పుడు అనే విషయంపై కూడా స్పందించిన సుప్రీత ఇప్పట్లో అయితే అలాంటి ఆలోచన లేదని అంటూ బహుశా మూడేళ్ళ అనంతరం పెళ్లి చేసుకునే అవకాశం ఉండవచ్చని క్లారిటీ ఇచ్చింది. సుప్రీత హీరోయిన్ అయ్యే ఛాన్స్ ఉన్నట్లు గతంలో కొన్ని రూమర్స్ వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇంకా ఆ దిశగా అడుగులు వేయలేదని సురేఖ వాణి రూమర్స్ కు చెక్ పెట్టింది. ఇక తన కూతురు ఎలాంటి కెరీర్ ను ఎంచుకున్నా కూడా తనకు ఏ మాత్రం అభ్యంతరం లేదని కూడా ఆమె తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X