మా అమ్మకు ఆయనతో రిలేషన్‌షిప్ లేదు.. అతడి సూసైడ్‌కు మేము కారణం కాదు.. సురేఖవాణి కూతురు సుప్రీత

కొంతమంది సెలబ్రిటీలకు ఏళ్లు గడుస్తున్నా స్టార్ డమ్ దక్కదు. కానీ మరికొందరికీ మాత్రం పుట్టుకతోనే బోల్డెంత క్రేజ్ వస్తుంది. ఈ లిస్ట్‌లోకే వస్తుంది నటి సురేఖవాణి కూతురు సుప్రీత. తన వ్యక్తిగత విషయాలు, ఫోటోలు, వీడియోలు, తల్లితో కలిసి చేస్తోన్న అల్లరిని సోషల్ మీడియాలో పెట్టి భారీ ఫాలోయింగ్‌ను సొంతం చేసుకున్నారు సుప్రీత. ఈ ఫాలోయింగ్‌ ద్వారా పలు బ్రాండ్స్ ప్రమోట్ చేస్తూ బాగానే సంపాదిస్తోంది ఈ ముద్దుగుమ్మ. అయితే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడంతో సుప్రీతపై పోలీసులు కేసులు కూడా నమోదు చేశారు. ఇటీవలి కాలంలో సినిమాల్లోనూ అవకాశాలు దక్కించుకున్న సుప్రీత. ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన తల్లి గురించి, తన గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ వివరాల్లోకి వెళితే..

బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్ల ఇంత అనర్ధం జరుగుతుందని నాకు తెలియదు. నేను చేసింది తప్పే కాబట్టి భవిష్యత్తులో ఎలాంటి తప్పుప జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటా. ఇప్పుడు లాయర్‌ను పెట్టుకున్నా.. ఏవైనా ప్రమోషన్స్ చేయమని ఆఫర్ వస్తే అతనిని సంప్రదించాకే ప్రమోషన్స్ చేస్తున్నా. విచారణలో భాగంగా బెట్టింగ్ యాప్స్‌కి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ ఇచ్చాం.. విచారణకు సహకరిస్తున్నామని చెప్పింది సుప్రీత.

Surekha Vani daughter Supritha Opens up About KP Chowdary Controversy

సింగిల్ ఉమెన్ గురించి సొసైటీలో కొన్ని పరిమితులు ఉన్నాయి. ఇలానే ఉండాలి, ఇలా చేస్తేనే రెస్పెక్ట్ ఉంటుందని అంటారు. కానీ అలా ఏమీ ఉండదు. ఆవిడ అలా చేయడం లేదు కాబట్టే మా అమ్మకు అంత నెగిటివిటీ. ఒక మహిళను అంత స్ట్రాంగ్‌గా చూసింది నా జీవితంలో అంటే మా అమ్మే. అలాంటి పరిస్ధితులు ఎదురైతే తట్టుకోవడానికి ఒక ఎనర్జీలా తీసుకుంటా. మా అమ్మ బెస్ట్ ఫ్రెండ్ కంటే ఎక్కువ.. పేరు పెట్టలేని బంధం, నాకు అన్నీ అమ్మే. ఏం పంచుకోవాలన్నా అమ్మే. ఏం చేసినా అమ్మకు చెప్పేదానిని. అమ్మకు చెప్పకుండా నైట్ టైం కారు తీసుకుని బయటకు వెళ్లిపోయేవాళ్లం అది మాత్రం మమ్మీకి చెప్పలేదు. అది కూడా అమ్మకు చెప్పేశా అని సుప్రీత తెలిపింది.

యూట్యూబ్‌లో ట్రావెలింగ్, ప్రమోషన్స్ ద్వారా డబ్బులు సంపాదించుకుంటున్నాం. అలాగనీ మాకు కోట్ల రూపాయల ఆస్తులు లేవు.. నేను, మా అమ్మ, మా కృష్ణగాడు అంతే.. మాది చిన్ని ఫ్యామిలీ. మాకు పెద్దగా ఖర్చు కూడా ఉండదు. ఎక్కడ సేవ్ చేయాలో చేసి ఎంజాయ్ చేస్తున్నాం. ఇదంతా అందరికీ కూర్చొబెట్టి చెప్పలేం. నేను సమాధానం చెప్పాల్సింది అమ్మకు, నా స్నేహితులకు మాత్రమే. బయట ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదు. మా అమ్మకు పెళ్లి చేయాలన్నది ఎప్పుడూ నా మైండ్‌లో ఉంటుంది. మా అమ్మకి మాత్రం డాడీతోనే ఆగిపోవాలని ఉంది. నేను పెళ్లి చేసుకునే ముందు మా అమ్మకి పెళ్లి చేసేస్తా. కానీ దొరకాలి. మమ్మీని చాలా బాగా చూసుకోవాలి, కాలు కింద పెట్టనీయకూడదు, ఆమెను స్వేచ్ఛగా ఉంచాలి అలాంటి వ్యక్తి దొరికితే మా అమ్మకు పెళ్లి చేసేస్తా. శివుడంటే నాకు బాగా ఇష్టం.. ఆయనకు చేతులెత్తి దండం పెట్టినప్పుడు కూడా ఆయనను ఏం అడగను. ఆయనకు నేను సరెండర్ అయిపోయా.. ఏం చేసినా ఆయన చేతుల్లోనే పెట్టేశానని సుప్రీత పేర్కొంది.

కేపీ చౌదరి గురించి యాంకర్ ప్రశ్నించగా.. ఆ రోజు అంత పెద్ద ఇష్యూ అవ్వడం వల్లే ఆ మనిషే సూసైడ్ చేసుకుని చనిపోయాడు. ముందు వెనుక ఏం జరిగిందని, రాసేవాళ్లు ఆలోచించడం లేదు. మీడియా వాళ్లు మా ఇంటి దగ్గరికి వచ్చేశారు. ఆ టెన్షన్‌తో మా అమ్మ వణికిపోయింది.. ఆవిడకు ఏమైనా అయ్యుంటే వీళ్లు రెస్పాన్సిబిలిటీ తీసుకునేవాళ్లా. డ్రగ్స్ విషయంలో మా అమ్మ.. బెట్టింగ్ యాప్స్‌ వల్ల నేను ఎఫెక్ట్ అయ్యాను. కానీ నేను బతుకుతోంది బెట్టింగ్ యాప్స్ డబ్బు వల్ల అన్నట్లుగా రాస్తున్నారు. జనాలు రాసిన రాతలకు, అన్న మాటలకు బాధపడి ఆ మనిషి సూసైడ్ చేసుకుని చనిపోయాడు. ఆ విషయం తెలిసి మా ఫ్యామిలీ అంతా ఎంతో బాధపడింది.

ఇలాంటి చెత్త రాతలకు మనం రియాక్ట్ కాకపోవడమే ఇలాంటి వాటికి బెస్ట్ మెడిసిన్. ఆ ఇన్సిడెంట్ తర్వాత మా మనసులు రాయిలా మారిపోయాయి. ఏం రాసినా మేం నవ్వుకుంటాం తప్పించి, పట్టించుకోవడం మానేశాం. మా ఏడుపుల మీద డబ్బులు ఏరుకుంటే పైనే దేవుడు చూసుకుంటాడు. నైతిక విలువలు ఉన్న కొన్ని ఛానెల్స్ ఉన్నాయి.. వాళ్లకు డబ్బులు, టీఆర్పీ రేటింగ్సే కావాలి. కేపీ చౌదరి మా ఫ్యామిలీకి క్లోజ్ ఫ్రెండ్.. నాకు అన్న లేని లోటును ఆయన తీర్చారు. అన్నయ్య అనే పిలిచేదానిని.. అంతకుమించి వేరే రిలేషన్ ఏం లేదు. చూసినవన్నీ నిజమని నమ్మితే అందరి జీవితాలు ముగిసిపోతాయని సుప్రీత వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Read more about: surekha vani supritha
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X