Supritha: "అమ్మను పెళ్లి చేసుకోవడానికి అబ్బాయిలు రెడీగా లేరు.. అలాంటి అంకుల్స్ కావాలి"
నటి సురేఖా వాణి గురించి ఆమె కూతురు సుప్రిత గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తల్లి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తుండగా.. కూతురు మాత్రం హీరోయిన్ అయ్యేందుకు సిద్ధం అయింది. బిగ్ బాస్ తెలుగు 7 షో రన్నరప్ అమర్ దీప్ చౌదరితో కిలిసి ఓ సినిమా చేస్తుంది. అయితే తాజాగా వీరిద్దరూ కలిసి దావత్ అనే షోకు రాగా.. అక్కడే సుప్రిత షాకింగ్ కామెంట్లు చేసింది. తన తల్లిని పెళ్లి చేసుకోవడానికి అబ్బాయిలు రెడీగా లేరని.. అలాంటి అంకుల్స్ అయితే తనతల్లికి కరెక్టుగా సెట్ అవుతారని చెప్పింది. ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
సురేఖ వాణి కూతురుగా అందరికీ తెలిసిన సుప్రిత చాలా రోజులుగా సినిమాల్లోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేసింది. సోషల్ మీడియా వేదికగా తన అందాలు ఆరబోస్తూ... దర్శక, నిర్మాతల కళ్లల్లో పడేందుకు చాలానే కష్టపడింది. అయితే ఆమె కష్టం గుర్తించిన దర్శక, నిర్మాతలు ఆమెకు సినిమాలో హీరోయిన్ గా అవకాశం ఇచ్చారు. ముఖ్యంగా బిగ్ బాస్ రన్నరప్ అమర్ దీప్ చౌదరి హీరోగా చేస్తున్న ఈ సినిమాలో ఈమెను హీరోయిన్ గా పెట్టుకున్నారు.

అయితే ఇటీవలే పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా హీరోహీరోయిన్లు.. తాజాగా దావత్ అనే షోకు వచ్చారు. అక్కడే సుప్రిత తన తల్లి గురించి షాకింగ్ కామెంట్లు చేసింది. కేవలం తల్లి గురించి కాకుండా తన గురించి కూడా అనేక విషయాలు చెప్పుకొచ్చింది. తన తండ్రి చనిపోయిన తర్వాత నుంచి.. తల్లికి మరో పెళ్లి చేయాలని చూస్తున్నట్లు వివరించింది. అయితే తల్లి మాత్రం పెళ్లి చేసుకోను అంటుందని తెలిపింది. అయితే ఆమె పెళ్లి చేసుకుంటానంటే మాత్రం వెంటనే చేసేస్తానని క్లారిటీ ఇచ్చింది.
అలాగే తన తల్లి సురేఖా వాణిని పెళ్లి చేసుకోవడానికి అబ్బాయిలు రెడీగా లేరని... అలాంటి అంకుల్స్ అయితే తన తల్లికి కరెక్టుగా సెట్ అవుతారని చెప్పుకొచ్చింది. తన తల్లిని పెళ్లి చేసుకోబోయే అంకుల్స్ ఎవరైనా... ఆమెను బాగా చూసుకోవాలని, టాక్సిక్ గా అస్సలే ఉండకూడదని వివరించింది. అలాంటి వాళ్లు తన దృష్టిలో పడి తన తల్లి పెళ్లికి ఓకే అంటే మాత్రం కచ్చితంగా వారికి పెళ్లి చేస్తానంటూ స్పష్టం చేసింది. అలాగే తాను గతంలో ఓ అబ్బాయితో ప్రేమలో ఉన్నానని కానీ అతను చాలా టార్చర్ చేశాడని చెప్పుకొచ్చింది.

స్లీవ్ లెస్ వేసుకోవద్దు, లిప్స్ టిక్ పెట్టుకోవద్దు, నెయిల్ పెయింట్ వేసుకోవద్దు.. అంటూ ఇలా చాలా రిస్ట్రిక్షన్స్ పెట్టాడని.. అవన్నీ భరించలేక అతడికి బ్రేకప్ చెప్పినట్లు సుప్రిత వెల్లడించింది. కానీ ప్రస్తుతం తమ జీవితాలు సాఫీగానే సాగుతున్నాయని.. హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుని తన లాటెంట్ ప్రూవ్ చేసుకోవాలనేదే తన కోరిక అని చెప్పింది. ముఖ్యంగా తాను ఎవరినైనా ఇష్టపడ్డా, ప్రేమించినా తల్లిని ఒప్పించే పెళ్లి చేసుకుంటానని వివరించింది.


Click it and Unblock the Notifications











