Supritha: పోర్న్ స్టార్ బయోపిక్‌పై సుప్రిత కామెంట్స్.. ఇద్దరు కలిసి తీయమంటూ! వీడియో వైరల్
ఈ మధ్య కాలంలో ఎవరైనా పాపులర్ కావాలంటే సులభంగా అయ్యే మార్గం సోషల్ మీడియా. ఇది అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి అనేక మంది సెబ్రిటీలుగా మారారు. అందులో ఎక్కువగా తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు కూడా ఉన్నారు.
ఇక ప్రముఖ తెలుగు సినీ నటి సురేఖ వాణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆమె కూతురు సుప్రిత కూడా సోషల్ మీడియా ద్వారా చాలా పాపులారిటీ సంపాదించుకుంది. సోషల్ మీడియాలో అదిరే అందాలతో అట్రాక్ట్ చేసే సుప్రిత చేసిన షాకింగ్ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

చిన్నతనం నుంచి: సినిమా రంగంలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది సీనియర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి. ఆమె సురేష్ తేజ దంపతులకు కూతురిగా పరిచయం అయింది బ్యూటిఫుల్ సుప్రిత. ఈ అమ్మడు చిన్న వయసు నుంచే తనదైన టాలెంట్ ను ప్రదర్శిస్తూ ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా ఈ ముద్దుగుమ్మ యూట్యూబర్‌గా తెగ పాపులర్ అయిపోయింది. అలాగే, అందంతోనూ అందరినీ అట్రాక్ట్ చేస్తూ హైలైట్ అయింది.

షార్ట్ ఫిల్మ్స్-కవర్ సాంగ్స్: సెలెబ్రిటీ డాటర్‌గా చిన్నప్పుడే ఫేమస్ అయిన గ్లామరస్ బ్యూటి సుప్రిత 2019లో 'మనీ మైండెడ్ గర్ల్‌ఫ్రెండ్' అనే షార్ట్ ఫిల్మ్‌లో నటించింది అలరించింది. ఇందులో తనదైన అందం, అభినయంతో ఆకట్టుకుంది. తద్వారా మంచి పేరును సంపాదించుకుంది. ఆ తర్వాత 'అవర్స్ వర్సెస్ అదర్స్', 'వెళ్లిపో', 'గాయత్రి పోతే పోవే' అనే కవర్ సాంగ్‌లు చేసి ఫుల్ క్రేజ్ సంపాదించింది.

తగ్గని రూమర్స్: ఆకట్టుకునే అందం, మైమరపించే నటనతో అలరిస్తోన్న సుప్రితను తల్లి సురేఖ వాణి హీరోయిన్‌గా సినిమాల్లోకి తీసుకు రానుందని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా సుప్రిత ఓ స్టార్ కిడ్ చేస్తోన్న మూవీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తుందని టాక్ తెగ వచ్చింది. కానీ, అలా ఇప్పటివరకు జరగలేదు. అయినప్పటికీ ఈ రూమర్స్ మాత్రం తగ్గట్లేదు.

పెళ్లి పుకార్లు: స్టన్నింగ్ బ్యూటి సుప్రిత తెలుగు రాష్ట్రాల్లో పాపులర్ అవడానికి ఆమె లవ్ ట్రాకులు కూడా మరో కారణంగా మారాయి. ఈ అమ్మడు ఫలానా స్టార్ కిడ్‌తో డేటింగ్ చేస్తుందని ఎన్నో రూమర్లు వచ్చాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు ఓ యూట్యూబర్‌తో ప్రేమలో ఉందని కూడా చెవులు కొరుక్కుంటున్నారు. అంతేకాకుండా అతనితో సుప్రిత పెళ్లి కూడా జరగనుందని జోరుగా వార్తలు వస్తున్నాయి.

కారులో వెళ్తూ: ఇదిలా ఉంటే ఎంతో కాలంగా సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో అట్రాక్ట్ చేస్తున్న బ్యూటిఫుల్ సుప్రిత ఆ మధ్య చేసిన కొన్ని కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఓ వీడియోలో కారులో వెళ్తున్న సుప్రీతను తన పక్కనున్న అతను "నెక్ట్స్ నువ్ ఏ బయోపిక్ చూడాలనుకుంటున్నావ్" అని అడిగాడు. దానికి సుప్రిత షాకింగ్ ఆన్సర్ ఇచ్చింది.
సూపర్ స్టార్ ఆయన: "ఒక్కరే ఒక్కరు ప్రపంచంలో చేసిన మొత్తం క్యారెక్టర్స్. సూపర్ స్టార్ ఆయన. హీ ఈజ్ వన్ అండ్ ఓన్లీ డాక్టర్, ప్లంబర్, కార్ పేంటర్, ఎలక్ట్రిషీయన్, డ్రైవర్.. వాట్ నాట్.. వాట్ నాట్.. హీ ఈజ్ ఏ కాప్, లాయర్.. అది మీకు ఎవరో తెలిస్తే చెప్పండి" అని తెగ నవ్వుతూ సుప్రిత చెప్పింది. దీంతో ఈ వీడియో వైరల్ కాగా అందరూ అతను ఎవరో కాదు.. పోర్న్ స్టార్ జానీ సిన్స్ పేరు చెప్పారు.

కలిసి తీస్తే బ్రేక్ ఇస్తాం: అంతేకాకుండా జానీ సిన్స్ గురించి చెప్పిన సుప్రిత వీడియో వైరల్ కాగా నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ ట్రోలింగ్ చేస్తున్నారు. మీరు కలిసి తీస్తే బ్రేక్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాం, బాగా చూస్తుంది కావచ్చు అంటూ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. ఇలా పోర్న్ స్టార్ జానీ సిన్స్ బయోపిక్ చూడాలన్న కోరికను చెప్పి ట్రోలింగ్ కు గురైంది సుప్రిత.


Click it and Unblock the Notifications











