బర్త్ డే అయిపోయినా తగ్గని సురేఖా వాణి.. మరో క్రేజీ వీడియో రిలీజ్!

తెలుగు నటీమణుల్లో సురేఖ వాణి అంటే తెలియని వారు ఉండరేమో. చేసేది సాంప్రదాయబద్ధమైన క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలే అయినా బయట మాత్రం ఆమె ఫుల్ ఫ్రీడమ్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. తెలుగులో ఎక్కువగా అక్క, వదిన, అమ్మ పాత్రలతో సినిమాల్లో కనిపించే ఈ నటి రియల్ జీవితంలో మాత్రం కూతురితో పోటీపడుతూ హాట్ హాట్ డ్రెస్ లు వేసుకుని సోషల్ మీడియాలో ఒక రేంజ్ క్రేజ్ సంపాదించింది. నిన్న సురేఖవాణి పుట్టినరోజు సందర్భంగా ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు వైరల్ గా మారాయి.

భర్త మరణంతో

భర్త మరణంతో

నిజానికి గత ఏడాది సురేఖ వాణి భర్త సురేష్ తేజ మరణించిన సంగతి తెలిసిందే..స్వతహాగా సీరియల్స్ కి దర్శకత్వం వహించేవారు ఆయన. సురేఖ వాణి కూడా మొదట్లో టీవీ రంగం నుంచి సినిమా రంగానికి వచ్చి స్థిరపడ్డారు.. అయితే సీరియల్స్ చేసే సమయంలో సురేఖ వాణి సురేష్ తేజ మధ్య ప్రేమ చిగురించడం తో వారిద్దరూ పెళ్లి చేసుకొని ఒక్కటయ్యారు.

కూతురితో పోటీ పడుతూ

కూతురితో పోటీ పడుతూ

భర్త ఉన్న సమయంలో పెద్దగా హైలెట్ కాలేదు కానీ భర్త చనిపోయిన తర్వాత కూతురితో పోటీ పడుతూ హాట్ హాట్ డ్రెస్ లు వేసుకుంటూ ఆమె సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయం చూసి ఎంతో మంది నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నా సరే ఆమె ఏమాత్రం పట్టించుకోదు.. తన పని తాను చేసుకుంటూ, సినిమాలు చేసుకుంటూ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూ ఉంటుంది.

అలా భర్త మీద ప్రేమ చాటుతూ

అలా భర్త మీద ప్రేమ చాటుతూ

ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలు, అప్ డేట్స్ ఇస్తూ ఉండే సురేఖ వాణి నిన్న పుట్టినరోజు సందర్భంగా తన కూతురు సుప్రీత, ఆమె స్నేహితులతో దిగిన ఫోటోలు కొన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది.. కూతురు సుప్రీత, ఆమె స్నేహితులు, అలాగే తనకు సంబంధించిన కొంతమంది సన్నిహితులతో కలిసి తన పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు ఆమె. కేక్ కటింగ్ సందర్భంగా కూడా తనకు ఎంతో ఇష్టమైన తన భర్త దివంగత సురేష్ తేజ ఫోటోలు కూడా కేక్ కటింగ్ పక్కనే పెట్టుకుని కేక్ కట్ చేసి ఆయన మీద ఉన్న ప్రేమను చాటుకుంది.

 కూతుర్ని ఆకాశానికెత్తేసి

కూతుర్ని ఆకాశానికెత్తేసి


ఇక తన పుట్టిన రోజుకు ఇన్ని ఏర్పాట్లు చేసి పుట్టిన రోజులు ఎంతో స్పెషల్ గా చేసిన తన కూతురు సుప్రీత కు సోషల్ మీడియా వేదికగా సురేఖ వాణి ధన్యవాదాలు చెప్పింది. ఈ జీవితానికి నిన్ను మించిన ఆస్తి ఆనందం మరొకటి లేదంటూ ఆమె కూతుర్ని ఆకాశానికెత్తేసింది.
అయితే నిన్న పుట్టినరోజు సందర్భంగా వేసుకున్న డ్రెస్ ఫోటోలు సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఆమె తాజాగా అడ్రస్ లో ఉన్న ఒక హాట్ వీడియో ని షేర్ చేసింది. సింపుల్ గానే ఉన్న అడ్రస్ లో అందాలు ఆరబోస్తూ ఆమె వీడియో లో కనిపించింది. దీంతో కుర్రాళ్ళు రెచ్చిపోయి కామెంట్లు పెడుతున్నారు.

Recommended Video

Actress Surekha Vani Panchekattu Video Goes Viral

రెండో పెళ్లి


ఇక ఈ మధ్యనే సింగర్ సునీత రెండో వివాహం చేసుకోవడంతో సురేఖా వాణి కూడా రెండో వివాహం చేసుకోబోతోంది అని ప్రచారం జరిగింది ఈ విషయాన్ని సురేఖ వాణి 12 సార్లు ఖండించింది. అయినా అదే ప్రచారం తరచూ జరుగుతూ ఉండడంతో ఆమె కూతురు సుప్రీత లైన్ లోకి వచ్చి అలాంటి వారందరికీ వార్నింగ్ ఇచ్చింది. తాజాగా ఆమె పుట్టినరోజు డ్రెస్ స్పెషల్ వీడియో మీరు కూడా చూసేయండి మరి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X