Surekha Vani: సుప్రిత సీక్రెట్‌ను సురేఖా వాణి లీక్.. తల్లి పోస్టుకు కూతురు హర్ట్
ప్రస్తుతకాలంలో సినిమాలతోనే కాకుండా సోషల్ మీడియా ద్వారా కూడా ఫేమ్ సంపాదించకోవచ్చు. ఈ సామాజిక మాధ్యమాన్ని ప్రతి ఒక్కరు సరదా కోసం వాడుతుంటారు. అయితే ఈ మధ్య కాలంలో సినిమాలు ఎక్కువగా చేయకుండా సోషల్ మీడియా ద్వారా హైలెట్ అవుతున్న నటి సురేఖా వాణి (Surekha Vani). ఈ సీనియర్ నటి తన కూతురు సుప్రిత (Supritha)తో కలిసి సోషల్ మీడియాలో చేసే రచ్చా అంతా ఇంతా ఉండదు. అప్పుడప్పుడు గ్లామర్ ట్రీట్ అందిస్తూ పర్సనల్ విషయాలు షేర్ చేసుకుంటారు. తాజాగా కూతురు సుప్రిత సీక్రెట్ ను ఓ పోస్ట్ ద్వారా బయటపెట్టింది సురేఖా వాణి.
అలా మొదలు: తెలుగు సినిమాల్లో ఎన్నో పాత్రలతో మెప్పించిన అందాల నటి సురేఖా వాణి. ఆమె సినిమాల్లోకి రాకముందు యాంకర్ గా కెరీర్ మొదలు పెట్టింది. అలా కెరీర్ కొనసాగుతోన్న సమయంలోనే ప్రముఖ దర్శక రచయిత సురేష్ తేజను పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత భర్తతో కలిసి పలు కార్యక్రమాలు చేసింది. ఈ క్రమంలోనే 'మా టాకీస్', 'హార్ట్ బీట్', 'మొగుడ్స్ పెళ్లామ్స్' అనే షోలకు యాంకర్‌గా చేసి మంచి గుర్తింపును సొంతం చేసుకుంది.

తన నటనతో: యాంకర్‌గా ఫేమస్ అయిన సురేఖా వాణికి తర్వాత సినిమాల్లో నటించే అవకాశాలు కూడా వచ్చాయి. ఇందులో భాగంగానే 2005లో వచ్చిన 'శ్రీను గాడు చిరంజీవి ఫ్యాన్' అనే మూవీతో నటిగా కెరీర్‌ను మొదలు పెట్టింది. అనంతరం ఎన్నో సినిమాల్లో నటిగా తన మార్క్ చూపించింది. ఇదిలా ఉంటే ఆమెకు సుప్రిత అనే కూతురు ఉన్న విషయం తెలిసిందే. సుప్రిత యూట్యూబర్ గా మంచి పాపులారిటీ తెచ్చుకుంది.
రీల్ ద్వారా: సుప్రిత పలు వీడియోలతో పాటు హై ఓల్టేజ్ గ్లామర్ ట్రీట్ అందిస్తుంటుంది. ప్రస్తుతం ఈ తల్లీ కూతుళ్లు ఇద్దరు న్యూజెర్సీ వెకేషన్ ను ఎంజాయ్ చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా అక్కడే ఉంటున్న వీళ్లు న్యూజెర్సీ వీధులు కలియతిరుగుతున్నారు. అంతేకాకుండా పవన్ కల్యాణ్ బ్రో సినిమాను న్యూజెర్సీలోనే చూశారు. ఇదిలా ఉంటే కూతురు సుప్రిత గురించి సురేఖా వాణి రీల్ ద్వారా ఓ విషయం చెప్పుకొచ్చింది.

ఇలాంటిదే తను: సురేఖా వాణి షేర్ చేసిన రీల్ వీడియో ఓ చిన్న పాప బొద్దింకను చంపేందుకు హిట్ పట్టుకుని ఒకచోట వెతుకుతుంటుంది. ఇంతలో ఆ బొద్దింక బయటకు రావడంతో ఒక్కసారిగా భయపడి ఏడుపు అందుకుని అటు ఇటు పరుగెత్తుతుంది. ఈ వీడియోను ఇన్ స్టా స్టోరీలో పోస్ట్ చేస్తూ "మా సుప్రిత కూడా ఇలాంటిదే" అంటూ బొద్దింకలకు ఇలాగే భయపడుతుందన్న సీక్రెట్ ను బయటపెట్టేసింది సురేఖా వాణి.
కామెడియా?:సురేఖా వాణి పెట్టిన ఇన్ స్టా స్టోరీకి సుప్రిత బదులిచ్చింది. తల్లి సురేఖా వాణి పోస్ట్ ను ట్యాగ్ చేస్తూ "ఏంటీ కామెడియా?" అని రాసుకొస్తూ హర్ట్ అయినట్లుగా చూపించే ఎమోజీని షేర్ చేసింది. ప్రస్తుతం వీరిద్దరి సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ కాగా అది చూసి నెటిజన్లు నవ్వుకుంటున్నారు. ఎప్పుడు అందాలతో ఆకట్టుకునే ఈ తల్లీ కూతుళ్లు ఇప్పుడు ఇలా హైలెట్ అయ్యారు.


Click it and Unblock the Notifications











