చిరంజీవి క్యారెక్టర్ అలాంటిది.. అందుకే వాళ్ళు.. సైరా డైరెక్టర్ సురేందర్ రెడ్డి కామెంట్స్
మెగాస్టార్ చిరంజీవి నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'సైరా నరసింహా రెడ్డి' భారీ రేంజ్‌లో విడుదలైంది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 5000 థియేటర్స్‌లో విడుదలైన ఈ సినిమా సక్సెస్ టాక్ తెచ్చుకుంటోంది. కాగా ఇంత అద్భుతంగా సైరా సినిమాను ప్రేక్షకుల ముందుంచిన సురేందర్ రెడ్డి ఇటీవల జరిగిన మీడియా సమావేశంలో చిరంజీవి క్యారెక్టర్ గురించి మాట్లాడారు. సెట్స్‌పై చిరు మెదిలే తీరు వివరించారు. వివరాల్లోకి పోతే..

చిరుతో సహా అమితాబ్
'సైరా నరసింహా రెడ్డి' సినిమాలో చిరంజీవితో పాటు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కూడా భాగమైన సంగతి తెలిసిందే. చిరు గురువుగా అమితాబ్ నటించారు. అయితే షూటింగ్ సమయంలో సెట్స్‌పై ఈ ఇద్దరూ మెగాస్టార్స్ తీరు ఎలా ఉండేదో తెలిపారు డైరెక్టర్ సురేందర్ రెడ్డి. చిరంజీవి, అమితాబ్ ఇద్దరూ దర్శకుడికి ఎంతో విలువనిచ్చే స్టార్స్ అని చెప్పారు.

నీకు నచ్చిందా? లేదా? అనేవారు
సన్నివేశంలో నటించిన వెంటనే తన దగ్గరకు వచ్చి ‘నీకు నచ్చిందా? లేదా?' అని అమితాబ్ బచ్చన్, చిరంజీవి అడిగేవారని, మెగాస్టార్స్ అయినప్పటికీ వారికి నటన పట్ల అంత అంకితభావం ఉండేదని చెప్పారు సురేందర్ రెడ్డి. ఇలాంటి గొప్ప లక్షణాల వల్లే వాళ్లు లెజండరీ యాక్టర్స్ అయ్యారని తెలిపారు. నటీనటులు అందరూ సహకరించారు కాబట్టే తాను ఈ సినిమా చేయగలిగానని ఆయన అన్నారు.

అందుకే బయోపిక్ కాదని చెప్పా
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితంలో ముఖ్యమైన సంఘటనలు, ఘట్టాలను తీసుకుని వాస్తవికతకు దూరంగా వెళ్లకుండా ఈ సినిమా తెరకెక్కించమని సురేందర్ రెడ్డి పేర్కొన్నారు. దర్శకుడిగా వాస్తవికతను, భారీ తనాన్ని బ్యాలెన్స్ చేస్తూ సినిమా తీయడం కొంచెం కష్టమైందని అన్నారు. తెరపై ఎంత భారీగా చూపించవచ్చో, అంత భారీగా చూపించామని, ఉయ్యాలవాడ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని చేశాను కనుక బయోపిక్ కాదని చెప్పానని సురేందర్ రెడ్డి అన్నారు.

బిజీగా ఉండటం కారణం గానే అలా జరిగింది
అయిదు భాషల్లో తెరకెక్కిన 'సైరా' కోసం ఏ భాషకు ఆ భాషలో డబ్బింగ్ చెప్పించి, ప్రత్యేకంగా సౌండ్ మిక్సింగ్, డీటీఎస్ చేయించామని సురేందర్ రెడ్డి చెప్పారు. ఆ పనుల్లో బిజీగా ఉండటం కారణం గానే తాను ముంబై, చెన్నై, కొచ్చి నగరాల్లో జరిగిన ప్రచార కార్యక్రమాలకు వెళ్లలేకపోయానని ఆయన తెలిపారు.

సైరా నరసింహా రెడ్డి విశేషాలు
కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రామ్ చరణ్ నిర్మాతగా 300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది 'సైరా నరసింహా రెడ్డి' మూవీ. ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. చిత్రంలో చిరంజీవి లీడ్ రోల్ పోషించగా.. అమితాబ్ బచ్చన్, తమన్నా, నయనతార, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, జగపతి బాబు కీలకమైన పాత్రల్లో నటించారు.


Click it and Unblock the Notifications











