మీతో జర్నీ మహా అద్భుతం.. సురేందర్ రెడ్డి ఎమోషనల్ ట్వీట్
స్వాతంత్ర్య ఉద్యమ వీరుడు ఉయ్యాలవాడ నర్సింహరెడ్డి జీవితం ఆధారంగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా సైరా నర్సింహారెడ్డి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌లో భాగంగా అమితాబ్ బచ్చన్ పోషిస్తున్న పాత్రకు సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ శనివారంతో పూర్తయింది. ఈ సందర్బంగా దర్శకుడు సురేందర్ రెడ్డి ఎమోషనల్ ట్వీట్ చేశారు.

బిగ్‌బీకి సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ పూర్తయింది. ఆయనతో జర్నీ మహా అద్బుతం. సైరాలో భాగమైనందుకు థ్యాంక్స్ సార్. మీతో కలిసి పనిచేయడం గొప్ప గౌరవం దక్కిందని భావిస్తున్నాను. మీపై ఎనలేని గౌరవం ఉంది. నా కల సాకారమైంది అని సురేందర్ రెడ్డి ట్వీట్ చేశారు. ఆయనతో దిగిన ఫోటోను ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకొన్నారు.
రూ.300 కోట్లకుపైగా భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న చిత్రంలో నయనతార, సుదీప్ కిచ్చ, జగపతిబాబు తదితరులు నటించారు. ఈ చిత్రం వచ్చే ఏడాది రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











