యువ హీరో కోసం కథను మార్చిన సురేందర్ రెడ్డి.. సైరా తరువాత ఇలాంటి సినిమానా?
ఒక బిగ్ బడ్జెట్ సినిమా చేసిన తరువాత ఆ దర్శకుడిపై అంచనాలు ఒక్కసారిగా మారిపోతాయి. సినిమా యావరేజ్ గా నడిచినా కూడా ఆ క్రేజ్ ని మరో సినిమాతో మరింత పెంచుకోవాలని చూస్తారు. కానీ సైరా దర్శకుడు మాత్రం ఎందుకో అలాంటి ప్రయోగం చేయడానికి ఇష్టపడటం లేదు. మళ్ళీ తన రెగ్యులర్ ఫార్మాట్ లోకి వచ్చి యాక్షన్ ఎంటర్టైన్ సినిమాలను రెడీ చేసుకుంటున్నాడు.
కిక్, రేసు గుర్రం, ధృవ వంటి కమర్షియల్ బాక్సాఫీస్ హిట్స్ అందుకున్న సురేందర్ రెడ్డి సైరా సినిమాతో తన క్రేజ్ ని మరింత పెంచుకోవాలని అనుకున్నాడు. కానీ ఆ సినిమా అంచనాలకు తగ్గట్టుగా ఆడలేకపోయింది. కానీ సురేందర్ రెడ్డి కూడా పాన్ ఇండియా సినిమాలను తెరకెక్కించగల దర్శకుడని నిరూపించుకున్నడు. అయితే ఎవరు ఉహీంచని విధంగా నెక్స్ట్ ఈ దర్శకుడు రామ్ పోతినేనిని సెలెక్ట్ చేసుకోవడం విశేషం.

పైగా భారీ బడ్జెట్ లో కాకుండా మిడియమ్ బడ్జెట్ లోనే తనదైన స్టైల్ లో ఒక పవర్ఫుల్ యాక్షన్ కథను సెట్ చేసుకుంటున్నాడు. ఇదివరకే ఈ ఇద్దరి మధ్య రెండు మూడు సార్లు కథా చర్చలు జరిగినప్పటికి రామ్ ఒప్పుకోలేదు. ఫైనల్ గా ఇటీవల చెప్పిన ఒక పవర్ఫుల్ కథకు రామ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక రామ్ నెక్స్ట్ రెడ్ సినిమాతో రాబోతున్న విషయం తెలిసిందే. మరి సురేందర్ రెడ్డి సినిమాను ఎప్పుడు స్టార్ట్ చేస్తాడో చూడాలి.


Click it and Unblock the Notifications











