twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రానా - మిహికా ఎంగేజ్మెంట్ జరగలేదు.. ఎందుకంటే: క్లారిటీ ఇచ్చిన నిర్మాత సురేష్ బాబు

    |

    టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం రానా దగ్గుబాటి పెళ్లి వేడుకలకు సంబంధించిన వార్తలు ఎక్కువగా వస్తున్నాయి. రానా తన ప్రేయసిని వివాహం చేసుకోబోతున్న విషయం తెలిసిందే. అయితే బుధవారం నాడు వీరి ఎంగేజ్మెంట్ కి సంబంధించిన అనేక రకాల కథనాలు వెలువడ్డాయి. కానీ ఎంగేజ్మెంట్ జరగలేదట. ఆ విషయంపై రానా తండ్రి సురేష్ బాబు వివరణ ఇచ్చారు.

    షాకిచ్చిన రానా

    షాకిచ్చిన రానా

    35 ఏళ్ల వయసులో మొత్తానికి సింగిల్ లైఫ్ కి ఎండ్ కార్డ్ పెట్టడానికి సిద్ధమైన రానా దగ్గుబాటి ఓ విధంగా అందరికి షాకిచ్చాడనే చెప్పాలి. ఇన్నాళ్లు సీక్రెట్ గా లవ్ ట్రాక్ ని నడిపిన దగ్గుబాటి హీరో ఫైనల్ గా ఒక ఇంటివాడు కాబోతున్నాడు. వీలైనంత త్వరగా పెళ్లి చేసుకోవాలని ఇటీవల అఫీషియల్ ఎనౌన్స్మెంట్ కూడా ఇచ్చాడు.

     ఎంగేజ్మెంట్ జరగలేదు..

    ఎంగేజ్మెంట్ జరగలేదు..

    రానా, మిహికా బజాజ్ ఎంగేజ్మెంట్ బుధవారం సాయంత్రం జరగనున్నట్లు గత వారం నుంచి కథనాలు వెలువడ్డాయి. కేవలం కొద్దీ మంది కుటుంబ సభ్యుల సమక్షంలోనే రానా మిహికా నిశ్చితార్థం ద్వారా మరింత దగ్గరకాబోతున్నట్లు టాక్ వచ్చింది. రామానాయుడు స్టూడియోలో ఏర్పాట్లు కూడా జరుగుతున్నట్లు వార్తలు రాగా ఇప్పుడు అలాంటి ఈవెంట్ జరగలేదని తెలిసింది.

    క్లారిటీ ఇచ్చిన సురేష్ బాబు

    క్లారిటీ ఇచ్చిన సురేష్ బాబు

    ఎలాంటి నిశ్చితార్థ వేడుకలు జరగలేదని నిర్మాత సురేష్ బాబు క్లారిటీ ఇచ్చారు. మొదటిసారి ఇరు వర్గాల కుటుంబాల పెద్దలు కూర్చొని పెళ్లికి సంబంధించిన విషయాల గురించి మాత్రమే చర్చించినట్లుగా రానా తండ్రి సురేష్ బాబు అధికారికంగా వివరణ ఇచ్చారు. అలాగే పెళ్లి డేట్ కూడా ఎప్పుడు ఫిక్స్ చేసుకుంటే బావుంటుందనే విషయంపై కూడా మాట్లాడుకున్నట్లు తెలిపారు.

    Recommended Video

    Rana Daggubati Announced 'Its Offiacial' About The Marriage With Miheeka
    ప్రీ వెడ్డింగ్ ప్లాన్స్

    ప్రీ వెడ్డింగ్ ప్లాన్స్

    పెళ్లికి ముందు జరగాల్సిన ఈవెంట్స్ తో పాటు పెళ్లి తరువాత జరగాల్సిన సంబరాలపై కూడా రానా, మిహికా కుటుంబ సభ్యులు కలిసి చర్చించుకున్నారట. ప్రీ వెడ్డింగ్ ప్లాన్ పై ఇప్పటికే నిర్ణయనికి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుత పరిస్థితులల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూడా దగ్గుబాటి కుటుంబ సభ్యులు దీర్ఘంగా ఆలోచిస్తున్నట్లు సమాచారం.

    English summary
    Suresh babu denies miheeka rana engagement fake news, recently Rana Daggubati's end card for solo life is known. Rana who ran her love track unbeknownst to others, is finally getting ready to marry the girl she loves. Clarity has recently revealed via social media that she is about to marry a young girl named Mihika Bajaj. However, their engagement in Hyderabad today.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X