సినిమా బావుందనే రిపోర్ట్స్ రాగానే ఏడ్చేసిన సమంత

సమంత, నాగ చైతన్య పెళ్లి తర్వాత తొలిసారి కలిసి నటించిన చిత్రం 'మజిలీ’. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి విజయం అందుకుంది. రూ. 40 కోట్ల షేర్ వసూలు చేసి నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు మంచి లాభాలు తెచ్చిపెట్టింది. అయితే ఈ మూవీ విడుదల రోజు ఎలాంటి ఫలితం వస్తుందో అని సమంత చాలా టెన్షన్ పడిందట.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో సమంత మాట్లాడుతూ..'మజిలీ’ విడుదల రోజు తెల్లవారు ఝామున 2.30 గంటలకే నిద్ర లేచాను. పాజిటివ్ రెస్పాన్స్ రావాలని పూజలు చేయడం మొదలు పెట్టాను. ఉదయం ఫస్ట్ రిపోర్ట్ సినిమా బావుంది, హిట్ అవుతుందని రాగానే... నాకు ఏడుపు ఆగలేదు. అరగంట సేపు ఏడుస్తూనే ఉన్నాను అని సమంత తెలిపాారు.

Suresh Babu planning to Oh Baby’ release in June

సమంత సినిమాతో సురేష్ బాబు రిస్క్ చేస్తున్నారా?

తెలుగులో ప్రముఖ నిర్మాణ సంస్థల్లో ఒకటైన సురేష్ ప్రొడక్షన్స్ ఈ ఏడాది వరుసగా 6 సినిమాలు రిలీజ్ చేసేందుకు సిద్దమైంది. ఈ మధ్య కాలంలో కంటెంట్ బేస్డ్ సినిమాలపై ఎక్కువ ఫోకస్ పెట్టిన ఈ నిర్మాణ సంస్థ కొత్త ఐడియాలు, కొత్త కథలను ఎంకరేజ్ చేయడంలో ముందు ఉంటోంది.

సురేష్ ప్రొడక్షన్స్ ఈ ఏడాది విడుదల చేస్తున్న చిత్రాల్లో సమంత నటించిన 'ఓ బేబీ' ఒకటి. ఈ చిత్రాన్ని జూన్లో రిలీజ్ చేయబోతున్నారట. ఈ సమయంలో రిలీజ్ చేయడం పెద్ద రిస్క్ అంటున్నారు ఇండస్ట్రీ విశ్లేషకులు. ఐసీసీ వరల్డ్ కప్ ప్రారంభం అవ్వడమే అందుకు కారణం. అయితే వరల్డ్ కప్ ప్రభావం 'ఓ బేబీ' సినిమా పడదని సురేష్ బాబు నమ్మకంగా ఉన్నారట.

'ఓ బేబీ' చిత్రంలో సమంత డెబ్బై ఏళ్ల ముసలమ్మ పాత్రలో... 20 యువతి పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇండియన్ సినిమా చరిత్రలో ఇప్పటి వరకు రాని ఒక విభిన్నమైన కథతో ఈ చిత్రం ఉండబోతోందని టాక్.

ఈ చిత్రంపై సమంత భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ మూవీ గురించి ఆమె గతంలో ఓ సందర్భంలో మాట్లాడుతూ.. నా మనసుకు ఎంతో దగ్గరైన చిత్రం. చాలా ప్రత్యేకమైన చిత్రం. నాకెంతో నచ్చిన పాత్రలో నటించాను. డైరెక్టర్ నందినీ రెడ్డి చాలా బాగా హ్యాండిల్ చేశారని తెలిపారు.

'ఓ బేబీ' చిత్రానికి ఇప్పటి తాను చేసిన సినిమాలన్నింటికంటే బెస్ట్ కాస్ట్ అండ్ క్రూతో పని చేసినట్లు దర్శకురాలు నందినీ రెడ్డి తెలిపారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, సురేష్‌ప్రొడక్షన్స్ సంస్థలతో కలిసి సునీత తాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కొరియన్ చిత్రం మిస్ గ్రానీ ఆధారంగా ఈ చిత్రం రూపొందిన సంగతి తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X