twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సురేష్ బాబు కీలక నిర్ణయం..ఐసొలేష‌న్ వార్డులుగా రామానాయుడు స్టూడియోస్‌

    |

    దేశం మొత్తం మీద కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. పరిస్థితి విషమించి హాస్పిటల్ కి వెళ్తే ఎక్కడా బెడ్లు దొరికే పరిస్థితి కూడా కనిపించడం లేదు. ఒకవేళ బెడ్ లు దొరికినా లక్షలు ఖర్చుపెట్టి ఫీజు కడితే తప్ప బెడ్ ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో కరోనా కల్లోలం సృష్టిస్తున్న వేళ ఇప్పటికే తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించిన దాదాపు అన్ని నిర్మాణ సంస్థలు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ కరోనా రోగులకు అవసరమైన సమాచారాన్ని షేర్ చేస్తున్న సంగతి తెలిసిందే.. అయితే తాజాగా సురేష్ బాబు తీసుకున్న నిర్ణయం అందరి చేత ఆయన మీద ప్రశంసల జల్లు కురిపించేలా చేస్తోంది.. .

    కరోనా భారీగా తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో ప్రస్తుతానికి అన్ని రాష్ట్రాల్లో ఆసుపత్రులలో బెడ్స్ కొరత ఉంది. బెడ్ లు లేక చెట్టు కింద, పుట్ట కింద, ఫ్లాట్ ఫామ్ మీద కూడా సేదతీరుతున్న దృశ్యాలు అందరి చేత కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. ఇలాంటి కీలక ఈ సమయంలో ఎవరూ ఊహించని ఎటువంటి నిర్ణయం తీసుకున్నారు సురేష్ బాబు. విశాఖపట్నంలో ఉన్న రామానాయుడు స్టూడియోని ఐసోలేషన్ వార్డులుగా మారుస్తున్నామని ప్రకాటించారు.

    Suresh Babu turns Rama Naidu Studios in Vizag as isolation wards

    ఇకనుంచి ఈ స్టూడియోలో కరోనా రోగులకు వైద్యం చేస్తున్న వైద్యులకు బస కల్పిస్తామని ప్రకటించారు. ఈ మేరకు సురేష్ ప్రొడక్షన్ సంస్థ నుంచి అధికారిక ప్రకటన కూడా వెలువడింది. అలాగే దానికోసం కాంటాక్ట్ నంబర్లు కూడా షేర్ చేశారు. సురేష్ ప్రొడక్షన్ సంస్థ ఇలా ప్రకటించడంతో పెద్ద ఎత్తున ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు. మరికొంతమంది అయితే మరో అడుగు ముందుకేసి మిగతా స్టూడియో ఓనర్లు కూడా ఇలా ప్రకటించాలని కోరుతున్నారు.

    English summary
    Suresh Productions have taken a huge decision regarding the Rama Naidu Studios in Vizag. According to the latest announcement, Rama Naidu Studios in Vizag has been converted into an isolation ward. All the doctors working on covid cases can get free accommodation there.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X