Don't Miss!
- News
ఢీ అంటే ఢీ అంటున్న రెండు పవర్ సెంటర్లు?
- Finance
Home Loan: హోమ్ లోన్ తీసుకోవాలనుకుంటున్నారా..? కొత్త టాక్స్ సిష్టం బెటరా..? పాతదే మేలా..?
- Travel
సందర్శకులను కనువిందుచేసే కొల్లేరు బోటు షికారు!
- Sports
INDvsAUS : ఈ మూడు విషయాలే సిరీస్ విజేతను నిర్ణయిస్తాయి..!
- Technology
వన్ ప్లస్ 11 స్పెసిఫికేషన్లు లీక్ ! లాంచ్ మరో రెండు రోజుల్లోనే ...!
- Lifestyle
Valentines Day 2023: వాలెంటైన్స్ డే రోజు ఈ పనులు అస్సలే చేయొద్దు, ఉన్న మూడ్ పోయి సమస్యలు రావొచ్చు
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
కీరవాణి కొడుకుతో సురేష్ ప్రొడక్షన్స్ సినిమా.. 'దొంగలున్నారు జాగ్రత్త' అంటూ!
టాలెంట్ ఎక్కడున్నా ప్రోత్సహించడానికి ముందుండే సురేష్ బాబు తన సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ ద్వారా మరో కొత్త దర్శకుడిని పరిచయం చేస్తున్నారు. అయితే ఆ సినిమాలో హీరోగా కీరవాణి కొడుకు నటిస్తుండగా కీలక పాత్రలో సముద్రఖని నటిస్తున్నారు. ఆ వివరాల్లోకి వెళితే

చిన్నప్పటి నుంచే
యమదొంగ సినిమాలో ఎన్టీఆర్ చిన్నప్పటి పాత్రలో నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు కీరవాణి చిన్న కుమారుడు శ్రీ సింహ కోడూరి. ఇక మూడేళ్ల తర్వాత వచ్చిన మర్యాద రామన్న సినిమాలో కూడా ఓబులేషు అనే పాత్రలో నటించి మెప్పించాడు. ఆ తర్వాత ఈగ సినిమాలో సమంత కొలీగ్ పాత్రలో నటించినా పెద్దగా జనం గుర్తించలేకపోయారు.

మొదటి సినిమానే హిట్
అయితే ఆయనకు నటన మీద ఉన్న ఆసక్తితో ఆయన 2019లో మత్తు వదలరా అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. చేసిన మొదటి సినిమానే వినూత్నమైన ప్రయోగం చేసి ప్రేక్షకుల ముందుకు రావడంతో ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఆ సినిమా ఇచ్చిన బూస్ట్ తో రెండేళ్ళు ఆగి తెల్లవారితే గురువారం అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కానీ ఈ సినిమా ప్రేక్షకులను అంతగా అలరించలేకపోయింది.

సురేష్ ప్రొడక్షన్స్ ప్రకటన
ఇక కొద్ది సేపటి క్రితం సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ పాము సింహ కోడూరితో సినిమా చేస్తున్నట్లుగా ప్రకటించింది. మా తరువాతి ప్రాజెక్టు అనౌన్స్ చేయడానికి చాలా ఉత్సాహంగా ఉన్నామని చెబుతూ 'దొంగలున్నారు జాగ్రత్త' అనే సినిమాలో సింహా కోడూరి, సముద్రఖని నటిస్తున్నారని పేర్కొంది..ఈ సినిమాని కొత్త దర్శకుడు సతీష్ త్రిపుర తెరకెక్కించబోతున్నారు అని వెల్లడించారు.

సముద్రఖని డైరెక్ట్ సినిమా
నిజానికి ఈ మధ్య కాలంలో సముద్రఖని డైరెక్ట్ తెలుగు సినిమాలు కూడా చేస్తున్నారు. క్రాక్ సినిమాలో ఆయన పండించిన విలనిజం అందరికీ గుర్తుండే ఉంటుంది.. ప్రస్తుతం ఆయన రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ ఆర్ ఆర్ ఆర్ సినిమాలో కూడా నటిస్తున్నారు.. ఆ తర్వాత ఈ సినిమాలో కూడా ఆయన నటిస్తూ ఉండడం సినిమా మీద కూడా అంచనాలు పెంచుతోంది అని చెప్పవచ్చు.
Recommended Video

హిట్ వస్తుందా?
ఈ సినిమాని సురేష్ ప్రొడక్షన్ సంస్థ గురు ఫిలిమ్స్ తో కలిసి సహ నిర్మిస్తోంది. మొత్తం మీద ఈ సినిమా టైటిల్ తోనే కాస్త ఆసక్తి రేకెత్తిస్తూ ఉండడంతో సినిమా కూడా కచ్చితంగా జనానికి నచ్చే విధంగా ఉంటుందని అందరూ భావిస్తున్నారు. మరి సింహకి ఈ మూడో సినిమా హిట్ తెచ్చిపెడుతుందో ? లేదో ? అనేది కాలమే నిర్ణయించాలి మరి.