సురేష్ ప్రొడక్షన్స్ నుంచి వరుసగా ఆరు సినిమాలు

తెలుగులో ప్రముఖ నిర్మాణ సంస్థల్లో ఒకటైన సురేష్ ప్రొడక్షన్స్ ఈ ఏడాది వరుసగా 6 సినిమాలు రిలీజ్ చేసేందుకు సిద్దమైంది. ఈ మధ్య కాలంలో కంటెంట్ బేస్డ్ సినిమాలపై ఎక్కువ ఫోకస్ పెట్టిన ఈ నిర్మాణ సంస్థ కొత్త ఐడియాలు, కొత్త కథలను ఎంకరేజ్ చేయడంలో ముందు ఉంటోంది.

సమంత నటించిన 'ఓ బేబీ', అల్లు శిరీష్ 'ఎబిసిడి', ఆనందర్ దేవరకొండ, శివాత్మిక నటిస్తున్న 'దొరసాని', 'ఫలక్‌నుమా దాస్', 'మల్లేశం', 'బ్రోచేవారెవరురా' తదితర చిత్రాలను ఈ ఏడాది థియేటర్లలోకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తోంది.

సురేష్ ప్రొడక్షన్స్ రంగంలోకి దిగడంతో ఈ చిన్న చిత్రాలను నిర్మించిన నిర్మాతలకు ట్రేబుల్ ప్రాఫిట్స్ దక్కడంతో పాటు... మంచి బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. త్వరలోనే వీటికి సంబంధించిన రిలీజ్ డేట్స్ అనౌన్స్ కాబోతున్నాయి.

Suresh Productions releasing six films this year

అక్కినేని సమంత నటిస్తున్న లేడీ ఓరియెంటెడ్ చిత్రం 'ఓ బేబి'. కొరియన్ చిత్రం మిస్ గ్రానీ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మహిళా దర్శకురాలు నందిని రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

అల్లు శిరీష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ఏబీసీడీ. అల్లు శిరీష్ సరసన రుక్సార్ థిల్లాన్ హీరోయిన్ గా నటిస్తోంది. బాల నటుడు భరత్ హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ లో నటిస్తున్నాడు. సంజీవ్ రెడ్డి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ 'దొరసాని' అనే ఓ మంచి ప్రేమకథా చిత్రంతో హీరోగా పరిచయం అవుతున్నారు. జీవిత రాజశేఖర్ కూతురు శివాత్మిక హీరోయిన్. ఈ చిత్రానికి కెవిఆర్ మహేంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు.

'వెళ్ళిపోమాకే' మూవీతో హీరోగా పరిచయమై, 'ఈ నగరానికి ఏమైంది' సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న విశ్వక్ సేన్.. నటిస్తూ, డైరెక్ట్ చేస్తున్న చిత్రం ఫలక్‌నుమా దాస్. సలోని మిశ్రా, హర్షిత గౌర్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.

నటుడు ప్రియదర్శి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం 'మల్లేశం'. రాజ్. ఆర్ దర్శకత్వంలో ఈ చిత్రం తెర‌కెక్కతుండగా శ్రీఅధికారి, రాజ్ ఆర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప‌ద్మ శ్రీ చింత‌కింది మ‌ల్లేశం జీవితం ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది.

మెంటల్ మదిలో, నీది నాది ఒకే కథ లాంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీవిష్ణు హీరోగా త్వరలో బ్రోచేవారెవ‌రురా అనే సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మ‌న్యం ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై విజ‌య్ కుమార్ మ‌న్యం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X