చిరు ప్రశంసలకు ఉక్కిరి బిక్కిరి.. ఆచార్య ఆర్ట్ డైరెక్టర్ ట్వీట్ వైరల్
మెగాస్టార్ చిరంజీవికి ఆనందం వస్తే ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఏదైనా అద్భుతాన్ని చూస్తే చిన్న పిల్లాడిలా మారిపోతుంటాడు. దాని గురించి అందరికీ చెప్పేయాలన్న ఆత్రుతతో ఉంటాడు. అదే క్రమంలో ఆచార్య సినిమా కోసం వేసిన అద్భుతమైన సెట్‌ను చూసిన చిరంజీవి ముగ్దుడయ్యాడు. ఆ విషయాన్ని ఆచార్య సెట్‌ను అందరికీ చూపించాలని ఓ వీడియో వదిలాడు చిరంజీవి.
ఇండియాలోనే అతిపెద్ద టెంపుల్ టౌన్ సెట్‌ను నిర్మించారు.. దాదాపు 20 ఎకరాల్లో అద్భుతమైన సెట్ నిర్మించారు. అందులో భాగంగా గాలి గోపురం. ఆశ్చర్యం గొలిపేలా ప్రతీ చిన్న విషయాన్ని డీటెయిల్‌గా మలిచారు.. ఇది కళా ప్రతిభకే మచ్చుతునక.. నాకెంతో ముచ్చట అనిపించి నా కెమెరాలో బంధించాను. మీతో పంచుకోవాలని అనుకున్నాను . నిజంగానే ఓ టెంపుల్ టౌన్‌లో ఉన్నామా? అనేంతగా ఈ సెట్‌ను రూపొందించిన కళా దర్శకులు సురేష్‌ని, ఈ టెంపుల్ టౌన్‌ను విజువలైజ్ చేసిన దర్శకుడు కొరటాల శివకు దీన్ని ఇంత అపూర్వంగా నిర్మించేందుకు కావాల్సిన వనరులను సమకూర్చిన నిర్మాత నిరంజన్ రెడ్డి, రామ్ చరణ్‌లను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానంటూ చిరు చెప్పుకొచ్చాడు.

కళా ప్రతిభకే మచ్చు తునక అంటూ చిరు ప్రశంసించడంతో ఆర్ట్ డైరెక్టర్ సురేష్ సెల్వరాజన్ గాల్లో తేలిపోయినట్టున్నాడు. చిరు ప్రశంసలకు ఉక్కిరిబిక్కిరి అయిన సురేష్ సోషల్ మీడియాలో స్పందిస్తూ.. ఇప్పుడు ఈ క్షణంలో ఎంత ఆనందంగా ఎంత సంతోషంగా ఉన్నానో చెప్పడానికి మాటలు దొరకడం లేదు.. ఎవరైనా ఒక్క రోజు మాత్రమే ఆనందంగా ఉండేలా చేస్తారు. కానీ మీరు, మీ మాటలతో నాకు ఈ ఏడాది మొత్తం సరిపడా ఆనందాన్ని ఇచ్చారు.. మీ ప్రశంసలతో ఈ ఏడాది ప్రారంభం అవ్వడం కంటే మంచి ఏముంటుంది.. ఆచార్య టీంతో కలిసి పని చేస్తున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది సర్ అంటూ చిరు గురించి చెప్పుకొచ్చాడు.


Click it and Unblock the Notifications











