twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సుగ్రీవుడి అస్థికల నిమజ్జనానికి కరోనా అడ్డంకి.. విషాదంలో ఫ్యామిలీ

    |

    రామాయణంలో సుగ్రీవుడు పాత్రలో నటించిన శ్యాంసుందర్ కలానీ మరణంతో బుల్లితెర ప్రేక్షకులు విషాదంలో మునిగిపోయారు. టెలివిజన్ చరిత్రలో రికార్డు స్థాయిలో హిట్టయిన సీరియల్‌లో కీలక పాత్రలో నటించిన ఆయన రెండు రోజుల క్రితం మరణించిన సంగతి తెలిసిందే. అనారోగ్యంతో బాధపడుతూ ఆయన మరణించారని రామాయణంలో రాముడిగా నటించిన అరుణ్ గోవిల్ ధృవీకరించారు. రామానంద సాగర్ రూపొందించిన రామాయణ్‌లో సుగ్రీవుడిగా నటించిన శ్యాంసుందర్ ఇకలేరనే విసయం తెలియజేయడానికి చాలా బాధగా ఉంది. వ్యక్తిగా గొప్పవారు. జెంటిల్మన్. అలాంటి ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి అని అరుణ్ గోవిల్ ట్వీట్ చేశారు.

    కరోనావైరస్ లాక్‌డౌన్ కారణంగా శ్యాంసుందర్ అంత్యక్రియలు నామమాత్రంగా పూర్తి చేశారు. ఆయన సన్నిహితులెవరూ చివరి చూపుకు కూడా నోచుకోలేదు. చాలా మంది ప్రముఖులు అంత్యక్రియలకు దూరంగా ఉన్నారు.

    Surgreev Shyam Sundars ashes immersion stalled amid Covid19 lockdown

    అయితే ఇప్పుడు శ్యాంసుందర్ ఆస్థికల నిమజ్జనం కార్యక్రమానికి కూడా కరోనా ఎఫెక్ట్ అవరోధంగా మారింది. ఆయన ఇంటికి ఇతరులెవరూ పోవడానికి వీలు లేకపోవడం, అలాగే ప్రయాణించడానికి ఎలాంటి వసతులు లేకపోవడం వల్ల ఆస్థికల నిమజ్జనానికి అడ్డంకిగా మారిందని కుటుంబ సభ్యులు తెలిపారు. అలాగే తన తండ్రి క్యాన్సర్ వ్యాధి కారణంగా మరణించలేదని, ఆయన మధుమేహ వ్యాధితో బాధపడుతున్నారు. ఆ కారణంగానే అనారోగ్యానికి గురై మరణించారు అని కూతురు జియా కల్యాణి చెప్పారు.

    ప్రస్తుతం రామాయణం సీరియల్ డీడీ నేషనల్ ఛానెల్‌లో ఉదయం 9 గంటలకు, అలాగే మళ్లీ రాత్రి 9 గంటలకు ప్రసారం అవుతున్నది. ఇటీవలే సుగ్రీవుడి కార్యెక్టర్ సీరియల్‌లో పరిచయం అయింది. ప్రస్తుతం రామాయణం సీరియల్‌కు మంచి ఆదరణ కనిపిస్తున్నది. ఈ తరం యువత కూడా రామాయణం ఆదరించడం పల్ల భారతీయ సంప్రదాయాలకు మంచి ఆదరణ ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.

    English summary
    Popular Ramayana's Sugreev artist Shyam Sundar died. Reports suggest that The latest reports suggest that the actor's ashes have been stored due to coronavirus lockdown.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X