For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'ఆకాశం నీ హద్దురా' ట్రైలర్.. విమానం టికెట్టు ధర ఒక్క రూపాయి

    |

    కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గతంలో మాదిరిగా ఎందుకో అనుకున్నంతగా సక్సెస్ అందుకోవడం లేదు. ముఖ్యంగా తెలుగులో అయితే మినిమమ్ వసూళ్లను కూడా అందుకోవడం లేడి. ఒకవైపు తమ్ముడు కార్తీ వరుస హిట్స్ తో దూసుకుపోతుంటే సూర్య మాత్రం డిజాస్టర్స్ ఎదుర్కొంటున్నారు. ఇక ఈ సారి ఎలాగైనా హిట్ అందుకోవాలని ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడు కెప్టెన్ జీఆర్ గోపీనాథ్ బయోపిక్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

    ఎంతో కాలంగా ఈ సినిమాపై చర్చలు జరుగుతున్నప్పటికీ వర్కౌట్ కాలేదు. ఫైనల్ గా సూర్య ధైర్యం చేసి ప్రాజెక్టును సెట్స్ పైకి తెచ్చాడు. గోపీనాథ్ జీవితం ఆధారంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు ఆకాశం నీ హద్దురా అనే టైటిల్ ని ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఫైనల్ గా సినిమాకు సంబంధించిన ట్రైలర్ ని కూడా విడుదల చేశారు. తక్కువ ఖర్చుతో ఒక రూపాయితో రైతు కూడా విమానంలో ప్రయాణించగలడు అని నీరూపించిన ఒక వ్యక్తి పాత్రలో సూర్య నటించిన విధానం సినిమాలో హైలెట్ కానున్నట్లు తెలుస్తోంది.

    ఎప్పుడో వేసవిలో థియేటర్స్ లో విడుదల కావాల్సి ఈ సినిమా కరోనా వైరస్ కారణంగా వాయిదా పడింది. ఇక థియేటర్స్ క్లోజ్ కావడంతో డైరెక్ట్ గా నవంబర్ 12న ఓటీటీలో విడుదల చేయడానికి సిద్ధమయ్యారు. లేడి డైరెక్టర్ సుధ కొంగర ఈ సినిమాను డైరెక్ట్ చేసిన విషయం తెలిసిందే. గతంలో ఎప్పుడు లేని విధంగా సూర్య సరికొత్త సినిమాతో వస్తుండడంతో సినిమాపై తమిళ్ లోనే కాకుండా తెలుగులో కూడా అంచనాలు పెరిగాయి.

    Suriya Aakaasam Nee HaddhuRa telugu Trailer talk

    మరి సినిమాతో ఎంతవరకు పాజిటివ్ టాక్ ను అందుకుంటాడో చూడాలి. సూర్య సొంత ప్రొడక్షన్ హౌస్ 2 డి ఎంటర్టైన్మెంట్ ..ఆస్కార్ అవార్డు గెలుచుకున్న బాలీవుడ్ నిర్మాత గునీత్ మొంగాతో కలిసి ఈ సినిమాను నిర్మించారు.

    English summary
    Needless to say, the story of the talented Tamil hero Surya's choice. His film will have something to do with the future. Needless to say, things like Seventh Sense Virus, Bundobast Locust Attack, etc., have gone viral. Looks like Next Time is preparing for another time travel.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X