Suriya: మీడియాకు సారీ చెప్పిన హీరో సూర్య .. అసలేం జరిగింది?
Suriya: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా కంగువా. ఈ సినిమాకు డైరెక్టర్ శివ దర్శకత్వం వహిస్తున్నారు. పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కిన ఈ సినిమా నవంబర్ 14 గ్రాండ్ గా విడుదల కానుంది. దీంతో మూవీ మేకర్స్ ప్రమోషన్లలో బిజీ బిజీగా ఉన్నారు. ఇందులో భాగంగానే ముంబైలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లో సడన్గ హీరో సూర్య మీడియాకు సారీ చెప్పి అందర్నీ ఆశ్చర్యపరిచారు అసలేం జరిగింది? ఆయన బహిరంగంగా సారీ చెప్పడానికి కారణమేంటి?
కంగ అనే ఓ పరాక్రముడి కథతో ఈ సినిమా సిద్ధమైంది. ఇందులో సూర్య ఆరు డిఫరెంట్ క్యారెక్టర్లలో కనిపించనున్నారు. ఈ సినిమాలో సూర్యతో పాటు బాబీ డియోల్, దిశా పటానీ, జగపతి బాబు, నటరాజన్ సుబ్రమణ్యం, యోగి బాబు, కోవై సరళ, ఆనందరాజ్, కేఎస్ రవికుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వాస్తవానికి ఈ సినిమా గురించి నాలుగేళ్ల నుంచి చర్చ జరుగుతోంది. అప్పట్లో కోవిడ్ -19 మహమ్మారి కారణంగా ఆగిపోయిన ఈ మూవీలో 2022లో మళ్లీ తెరపైకి వచ్చి 2024లో థియేటర్లలోకి వస్తోంది. కంగువా మూవీపై తెలుగులోనూ భారీగా అంచనాలు ఉన్నాయి.

ప్రపంచవ్యాప్తంగా కంగవా మూవీ నవంబర్ 14న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు. కంగువా దాదాపు 10వేల స్క్రీన్స్‌లో ప్రదర్శించనున్నారట. ఇందులో సౌత్‌లో 2500, నార్త్ లో 3,500 స్క్రీన్లలో ప్రదర్శించునున్నట్టు మూవీ మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమా కనీసం రూ.1000 కోట్లు కలెక్ట్ చేస్తుందని కంగువా ప్రొడ్యూసర్ ఆశ భావం వ్యక్తం చేశారు.
మూవీ ప్రమోషన్ లో భాగంగా కంగువ టీం ముంబైలో ప్రెస్ మీట్ నిర్వహించింది. అయితే ఈ ప్రెస్ మీట్ కు సూర్య ఒక గంట ఆలస్యంగా వచ్చారు. ఇదే విషయాన్ని అక్కడి జర్నలిస్టులు అడగగా.. తన బౌన్సర్లు కాస్త దురసుగా వ్యవహరించారు. దీంతో వెంటనే సూర్య.. స్టేజ్ పైకి వెళ్లి.. మైకు పట్టుకుని బహిరంగంగా క్షమాపణ చెప్పారు. ఆలస్యంగా వచ్చినందుకు క్షమించండి. ట్రాఫిక్ వల్ల తాను సరైన సమయానికి రాలేదని, మీ అందరి విలువైన సమయాన్ని వేస్ట్ చేశానని, సారీ చెప్పారు.

అనంతరం సమావేశంలో మాట్లాడుతూ.. సినిమాపై పలు ప్రశ్నలకు సూర్య సమాధానమిచ్చారు. కంగువ మూవీకి సీక్వెల్ గా కంగువా 2 కు క్రేజీ అప్డేట్ ఇచ్చారు. కంగువ 1 క్లైమాక్స్‌లో ఎన్నో ఆశ్చర్యకరమైన ప్రశ్నలు ఉంటాయని, వాటన్నిటికీ కంగువ 2లో సమాధానం ఉంటుందన్నారు. అందుకే రెండో పార్ట్ కోసం అందరితో పాటు తాను ఈగర్ గా వేయిట్ చేస్తున్నానని తెలిపారు.


Click it and Unblock the Notifications











