రోలెక్స్ కోసం.. 20 ఏళ్ల రూల్ కు బ్రేక్.. ఆ విషయంలో బాధపడుతున్న సూర్య

తమిళ స్టార్ హీరో సూర్యకు దేశ వ్యాప్తంగా ఎంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో తెలిసిందే. సూర్య సినిమాలకు తమిళంలోనే కాకుండా ఇతర భాషల్లోనూ మంచి డిమాండ్ ఉంటుంది. ఆయనను అభిమానించే వారు అన్నీ భాషల్లోనూ ఉంటడంతో సూర్య సినిమాల కోసం ఫ్యాన్స్, ఆడియెన్స్ ఎదురు చూస్తూ ఉంటారు. సూర్య కూడా తన ఫ్యాన్స్ కోసం ప్రయోగాత్మక చిత్రాలు చేస్తూనే ఉంటారు. అన్ని వర్గాల ఆడియెన్స్ ను మెప్పించేలా సినిమాలు చేస్తూ వస్తున్నారు. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా సినిమాలతో అలరిస్తున్నారు.

చివరిగా 'కంగువా' చిత్రంతో సూర్య థియేటర్లలో సందడి చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ చిత్రం కమర్షియల్ గా ఫెయిల్ అయ్యింది. ఫ్యాన్స్, ఆడియెన్స్ కు కూడా అంతగా నచ్చకపోవడం గమనార్హం. ఇక ప్రస్తుతం 'రెట్రో' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు సూర్య. మే1న ఈ చిత్రం గ్రాండ్ గా విడుదలైంది. పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేశారు. మొదటి షోల్లో పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. దీంతో సినిమా కలెక్షన్లపై ఆసక్తి నెలకొంది.

Suriya Breaks his 20 Years rule in Acting Profession for Rolex Role in Vikram Movie

అయితే, సూర్య తన లేటెస్ట్ ఫిల్మ్ రెట్రో విడుదల సందర్భంగా జోరుగా ప్రమోషన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా తన కెరీయర్ లో ఒక రూల్ ను బ్రేక్ చేశానని చెప్పుకొచ్చారు. ఆయన నటజీవితంలో తన సినిమాల ద్వారా ఎప్పుడూ స్మోకింగ్, డ్రింకింగ్ హ్యాబిట్ ను చూపించలేదని చెప్పారు. కానీ 'విక్రమ్' సినిమాలోని రోలెక్స్ పాత్రతో అది బ్రేక్ అయ్యిందని చెప్పారు. ఇక 'రెట్రో' చిత్రంలోనూ స్మోకింగ్ చేస్తూ కనిపిస్తానని సూర్య ఇప్పటికే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పుకొచ్చారు.

అయితే సినిమాల్లో చూసి ఎవరూ అలాంటి వ్యవసనాలకు అలవాటు కావొద్దని సూచించారు. అయితే రీసెంట్ గా ఇంటర్వ్యూలో తన 20 ఏళ్ల నట జీవితంలో ఎప్పుడూ స్మోకింగ్ కు సంబంధించిన పాత్రల్లో నటించే ప్రయత్నం చేయలేదని అన్నారు. ఇక రోలెక్స్ పాత్ర కూడా అనుకోకుండా జరిగిపోయిందని, ఆ పాత్ర చాలా క్రూరమైన, చెడ్డ వాడికి సంబంధించినదనే విషయం మాత్రమే తనకు తెలుసు అన్నారు. కానీ షూటింగ్ కు వెళ్లిన తర్వాత స్క్రిప్ట్ ఇచ్చారని, కేవలం హాఫ్ డే షూటింగ్ మాత్రమే చేశారని చెప్పారు. అంతలోనే విధ్వంసం చూపించారని చెప్పుకొచ్చారు.

ఇక అలాంటి పాత్రల కోసం తన నియమాన్ని బ్రేక్ చేశానని చెప్పారు. ఇక ప్రస్తుతం సూర్య రెట్రో చిత్రంతో ప్రేక్షకులను అలరించేందుకు థియేటర్లలోకి వచ్చారు. ఈ మూవీలో సూర్య తన వింటేజ్ పెర్ఫామెన్స్ తో ఆకట్టుకోబోతున్నారని తెలుస్తోంది. ఈ చిత్రంలో సూర్య సరసన స్టార్ హీరోయిన్ పూజా హెగ్దే నటిస్తోంది. తమిళ ప్రముఖ దర్శకుడు శివ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని 2డీ ఎంటర్ టైన్ మెంట్, స్టోన్ బెంచ్ క్రియేషన్స్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మించారు. జ్యోతిక, సూర్య, కార్తీకేయన్ సంతానం, రాజశేఖర్ పాండియన్ లు నిర్మాతలుగా వ్యవహరించారు. సంతోష్ నారాయణ్ అద్భుతమైన సంగీతం అందించారు.

More from Filmibeat

Read more about: suriya Retro movie pooja hegde
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X