Kangua Sizzle Teaser: సింహంలా గర్జిస్తూ వెన్నులో వణుకుపుట్టిస్తున్న సూర్య.. కంగువా టీజర్ చూశారా?
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య అద్భుతమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ముఖ్యంగా పాన్ ఇండియా స్థాయిలో రాబోతున్న కంగువా అనే చిత్రంలో నటిస్తున్నారు. ముఖ్యంగా దర్శకుడు శివ డైరెక్షన్ లో రాబోతున్న ఈ సినిమాలో సూర్య సరసన దిశా పటాని నటించబోతుంది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి సిజిల్ టీజర్ ను విడుదల చేశారు. ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి జ్ఞానవేల్ రాజా ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. సూర్య, దిశా పటానిలు హీరోహీరోయిన్లుగా కనిపిస్తుండగా.. బాబీ డియోల్ ప్రతినాయకుడిని కనిపించబోతున్నారు. టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో జగపతి బాబు, కమెడియన్ యోగి బాబు, కోవై సరళ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. స్టూడియోస్ గ్రీన్, యువీ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

మొత్తం మూడు పార్టుల్లో ఈ సినిమాను తీసుకురాబోతున్నట్లు ఇప్పటికే చిత్రబృందం ప్రకటించగా.. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన సిజిల్ టీజర్ ను విడుదల చేశారు. ఇందులో సూర్య లుక్ చాలా భయంకరంగా కనిపిస్తోంది. ముఖ్యంగా హీరోయ సూర్యలోని మాస్ యాంగిల్ ను చూపించారు. రెండు కత్తులు చేత పట్టుకుని మనుషులను నరికే విధానాన్ని చూపించారు. ఈ టీజర్ చూస్తుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి.
కుప్పలు తెప్పలుగా మనుషులను నరుకతూ.. వారి శావాలను ఓ చోట కుప్పగా వేయడం చూస్తుంటేనే భయమేస్తుంది. ఇక చివర్లో అయితే విలన్ తో పోటీ పడుతుండగా... సూర్య చూసే చూపు, ఆ తర్వాత సింహంలా గర్జించే తీరు కూడా వెన్నులో వణుకు పుట్టిస్తోంది. సముద్రంలో పడవల్లో వెళ్తూ.. చేసే ఫైటింగ్ సీన్లు కూడా ఈ సినిమాకు ప్లస్ కాబోతున్నట్లు అర్థం అవుతోంది.

ఈ అద్భుతమైన సినిమాకు ఎడిటర్ గా నిషాద్ యూసుఫ్ పని చేస్తుండగా.. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. అదిరిపోయే విజ్యువల్ వండర్ గా రాబోతున్న ఈ సినిమాను ఏకంగా 38 భాషల్లో విడుదల చేయబోతున్నట్లు ఇప్పటికే ప్రొడ్యూసర్ ప్రకటించారు. ఐమ్యాక్స్, 3డీ వెర్షన్ లలో కంగువా చిత్రాన్ని అందుబాటులో ఉంచబోతున్నట్లు ప్రకటించి అందిరినీ సర్ ప్రైజ్ చేశారు. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుందో తెలియాలంటే ఇంకా కొంత కాలం ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications











