బాలీవుడ్‌లోకి సూరారైపొట్రూ.. ఆకాశమే నీ హద్దురా మూవీకి నిర్మాతలు ఎవరంటే!
విలక్షణ నటుడు సూర్య, దర్శకురాలు సుధా కొంగర కాంబినేషన్‌లో వచ్చిన సురారై పొట్రూ (తెలుగులో ఆకాశమే నీ హద్దురా) అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో ట్రెండింగ్‌గా నిలిచింది. ఈ చిత్రం సామాన్య ప్రేక్షకులనే కాకుండా సినీ విమర్శకుల ప్రశంసలు అందుకొన్నది. అలాగే ఈ సినిమా రిలీజ్ సమయంలో రికార్డుస్థాయిలో అమెజాన్ ప్రైమ్ వీడియో యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొన్నారు. ఇలాంటి ప్రత్యేకతలు ఉన్న ఈ చిత్రం ప్రస్తుతం బాలీవుడ్‌లో రీమేక్ కానున్నది. ఈ విషయాన్ని బాలీవుడ్ నిర్మాత విక్రమ్ మల్హోత్రా అధికారికంగా ప్రకటించారు. ఈ వివరాల్లోకి వెళితే..
తెలుగు, తమిళ భాషల్లో మంచి విజయాన్ని అందుకొన్న సురారైపోట్రూ మూవీని బాలీవుడ్‌లో నిర్మించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ చిత్రానికి తమిళ వెర్షన్‌కు దర్శకత్వం వహించిన సుధా కొంగర డైరెక్షన్ చేయనున్నారు.

సురారై పోట్రూ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయబోతున్నారు. ఈచిత్రాన్ని హీరో సూర్య, ఆయన సతీమణి, హీరోయిన్ జ్యోతిక, రాజశేఖర్ పాండ్యన్, విక్రమ్ మల్హోత్రా నిర్మిస్తున్నారు. అబుండంటియా ఎంటర్‌టైన్‌మెంట్, 2డీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తారు. నిర్మాత విక్రమ్ విషయానికి వస్తే హిందీలో ఇటీవల విద్యాబాలన్‌తో షేర్ని, అక్షయ్ కుమార్‌తో ఎయిర్‌లిఫ్ట్ చిత్రాన్ని నిర్మించారు.

బాలీవుడ్ రీమేక్ గురించిన వార్తను సూర్య, జ్యోతిక, సుధా కొంగర, రమేష్ మల్హోత్రా, రాజశేఖర్ తదితరులు అధికారికంగా ప్రకటించారు. ఈ వార్త ప్రస్తుతం ట్విట్టర్‌లో ట్రెండింగ్‌గా మారింది.


Click it and Unblock the Notifications











