మోహన్ బాబుకు కోలీవుడ్ స్టార్ హీరో సహాయం: ‘సన్ ఆఫ్ ఇండియా’ అదిరిపోయే ప్లాన్

హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, ప్రొడ్యూసర్‌గా ఇలా ఎన్నో రకాలుగా దాదాపు నలభై ఏళ్లుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో తన హవాను చూపిస్తున్నారు డైలాగ్ కింగ్ మంచు మోహన్ బాబు. సుదీర్ఘమైన ప్రయాణంలో హీరోగా ఎన్నో సినిమాల్లో నటించిన ఆయన.. ఈ మధ్య లీడ్ రోల్స్ పెద్దగా చేయడం లేదు. కానీ, ఎన్నో సినిమాల్లో మంచి మంచి పాత్రలను మాత్రం పోషిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతం ఆయన ప్రధాన పాత్రలో ఓ సినిమాను చేస్తున్నారు. అదే.. 'సన్ ఆఫ్ ఇండియా' మూవీ. తాజాగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది చిత్ర యూనిట్.

మోహన్ బాబు హీరోగా.. టాలీవుడ్‌లో మంచి రచయితగా గుర్తింపు తెచ్చుకున్న డైమండ్ రత్నబాబు దర్శకుడిగా మారి తెరకెక్కిస్తోన్న చిత్రం 'సన్ ఆఫ్ ఇండియా'. నిజమైన సంఘటన ఆధారంగా పొలిటికల్ నేపథ్యంతో రూపొందుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక, ఈ మూవీ టీజర్ జూన్ 4 (శుక్రవారం) విడుదల కాబోతుందని చిత్ర యూనిట్ తాజాగా ప్రకటించింది. దీన్ని కోలీవుడ్ స్టార్ హీరో సూర్య చేతుల మీదుగా రేపు మధ్యాహ్నం 12.20 గంటలకు విడుదల చేయబోతున్నారు. గతంలో సూర్య నటించిన 'ఆకాశమే హద్దురా' మూవీలో మోహన్ బాబు నటించిన విషయం తెలిసిందే.

Suriya to Launch Mohan Babus Son Of India Teaser

ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'సన్ ఆఫ్ ఇండియా' మూవీలో మోహన్ బాబు సరికొత్త పాత్రలో నటిస్తున్నట్లు ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లకు భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. దీంతో మూవీపై అంచనాలు పెరుగుతున్నాయి. ఇదిలా ఉండగా.. ఈ సినిమాను 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్స్‌పై మోహన్ బాబు స్వయంగా నిర్మిస్తున్నారు. మేస్ట్రో ఇళయరాజా సంగీత సారథ్యం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ చాలా వరకూ పూర్తైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X