ఇండస్ట్రీని షేక్ చేసిన ‘గజిని’.. ఫస్ట్ హీరో సూర్య కాదా? మరీ ఎవరో తెలుసా?
తమిళ స్టార్ హీరో సూర్య నటించిన గజినీ చిత్రం ఇప్పటికీ ప్రేక్షకులకు గుర్తుండే ఉంటుంది. ఆ చిత్రంతో సూర్య ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేశారో తెలిసిందే. 2005లో తమిళ భాషలో యాక్షన్ థ్రిల్లర్ గా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళ స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. సలీం చంద్రశేఖరన్ నిర్మాత వ్యవహరించారు. సరిగా 20 ఏళ్ల కింద వచ్చిన ఈ సినిమా తమిళంలో బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచింది. ఈ చిత్రాన్ని తెలుగులోనూ విడుదల చేశారు. తమిళంతో పాటు తెలుగులోనూ విజయవంతమైంది ఈ చిత్రం.
స్టార్ హీరో సూర్య లీడ్ రోడ్ లో నటించగా లేడీ పవర్ స్టార్ నయనతార, స్టార్ హీరోయిన్ హాసిని హీరోయిన్లుగా నటించారు. ప్రదీప్ రావత్ విలన్ రోల్ లో ఎంత అద్భుతంగా నటించారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 7 కోట్ల రూపాయల బడ్జెట్తో నిర్మించిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద 50 కోట్ల రూపాయల కలెక్షన్ల గ్రాస్ వసూలు చేసింది. అప్పట్లో థియేట్రికల్ రౌండ్ లోనే కాకుండా బాక్సాఫీస్ వసూళ్లలోనూ సంచలనంగా మారింది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ కూడా కావాలని ఓవైపు ఫ్యాన్స్, మరోవైపు సినీ ప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు. త్వరలో ఉండబోతుంది అంటూ గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి.

ఇక ఈ గజని చిత్రాన్ని తమిళంలో విడుదలైన రెండు నెలలకే తెలుగులో అగ్ర నిర్మాత అల్లు అరవింద్ రైట్స్ కొనుగోలు చేసి విడుదల చేశారు. ఈ చిత్రాన్ని బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ తో రీమేక్ చేసి సక్సెస్ అయ్యారు. ఇతర సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ చిత్రాన్ని మొదట స్టార్ హీరో రిజెక్ట్ చేశారంట. తాజాగా ఆ విషయం వెలుగులోకి వచ్చింది. ఆ స్టార్ హీరో ఎవరో కాదు ఆర్ మాధవన్ కావడం విశేషం. అప్పట్లో సూర్య కంటే మాధవన్ కు ప్రేక్షకు ఆదరణ ఎక్కువగా ఉండేది. దాంతో ఈ సినిమా ఆఫర్ ఆయనకు ఫస్ట్ వెళ్లిందని చెబుతున్నారు.
ఎందుకో గాని ఆర్ మాధవన్ చిత్రంలో నటించేందుకు ఒప్పుకోలేదంట. దాంతో టాలెంటెడ్ హీరో సూర్య ట్రాక్ లోకి వచ్చారు. గజిని చిత్రం తర్వాత సూర్య కెరియర్ ఒక్కసారిగా మలుపు తిరిగింది. సూర్య కూడా తన నట విశ్వరూపం చూపించి ప్రేక్షకుల ప్రశంసలు పొందారు. ఇక గజని చిత్రానికి హరీష్ జయరాజ్ అందించిన సంగీతం ఇప్పటికీ మ్యూజిక్ లవర్స్ ను ఆకట్టుకుంటూనే ఉంది. ఇక ఇప్పుడు సూర్య ఎలాంటి ప్రాజెక్ట్ స్లో నటిస్తున్నారో చూస్తూనే ఉన్నాం. చివరిగా విక్రమ్ సినిమాలో మూడు నిమిషాల పాటు ఉండే రోలెక్స్ పాత్రలో నటించి సంచలనం సృష్టించారు. ఆయన అగ్రిసివ్ పెర్ఫామెన్స్ కు థియేటర్లలో యువత గోలగోల చేసిన సంగతి తెలిసిందే.
చివరిగా సూర్య ఎపిక్ ఫాంటసీ యాక్షన్ ఫిలిం కంగువాలో నటించి అలరించారు. శివ దర్శకత్వం వహించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించి అదరగొట్టారు. ఇక త్వరలో సూర్య నుంచి రెట్రో అనే రొమాంటిక్ యాక్షన్ ఫిలిం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 65 కోట్లతో నిర్మించిన ఈ చిత్రం మే 1వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. స్టార్ హీరోయిన్ పూజ హెగ్డే ఫిమేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఆ తర్వాత సూర్య నుంచి సూర్య 45, వడివాసల్ అనే చిత్రాలు కూడా ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











