అసలే పీకల్లోతు డిజాస్టర్లతో అక్షయ్ కుమార్.. సర్ఫిరా విడుదలకు ముందే యూట్యూబ్లో సూర్య హిందీ మూవీ

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య చేస్తున్న ఓ హిందీ ప్రయత్నంపై దెబ్బ కొట్టే పనిలో పడ్డాడు ఓ నిర్మాత. సూరారై పొట్రు హిందీ రీమేక్ కు భారీ నష్టాలు వచ్చే దిశగా పావులు కదుపుతున్నాడు. ఇంతకీ ఈ నిర్మాత ఇలాంటి పిచ్చి పనులు ఎందుకు చేస్తున్నాడు? అతనికి మేకర్స్ నుంచి ఏం కావాలి? అనే విషయంపై ఓ లుకేద్దాం పదండి.

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఏడాదికి ఐదారు సినిమాలతో మూవీ లవర్స్ ను అలరిస్తున్న అక్షయ్ ఖాతాలో సాలిడ్ హిట్టు పడి చాలా కాలమే అవుతుంది. అందుకే తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ రీమేక్ తో ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగానే సర్ఫిరా అనే సినిమాను చేస్తున్నాడు. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య హీరోగా నటించిన ఆకాశం నీ హద్దురా సినిమాకు ఈ మూవీ హిందీ రీమేక్.

Suriya s Soorarai Pottru dubbed Hindi version to release on youtube before Akshay Kumar Sarfiraon Goldmine Telefilms YouTube channel on July 12

జూలై 12న అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్న సర్ఫిరా మూవీని రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. కెప్టెన్ జి ఆర్ గోపీనాథ్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ హిందీ రీమేక్ లో సూర్య అతిథి పాత్రలో కనిపించబోతున్నాడు. తమిళంలో ఇదే మూవీని సూర్య హీరోగా సూరారై పొట్రు అనే టైటిల్ తో రిలీజ్ చేశారు. పేదలు కూడా విమానంలో తిరగాలి అనే ఆశయంతో కన్నడిగ అయిన కెప్టెన్ జిఆర్ గోపీనాథ్ తక్కువ ధరకే విమాన సేవలు అందించారు.

ఈ స్ఫూర్తిదాయకమైన స్టోరీతో వచ్చిన ఆకాశం నీ హద్దురా మూవీ తెలుగుతోపాటు తమిళంలో కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. అలాగే కన్నడ, హిందీ భాషల్లో కూడా డబ్ చేశారు. ఇప్పటికే హిందీ ప్రేక్షకులు ఒరిజినల్ సినిమాను ఓటిటిలో చూశారు కూడా. దీంతో అసలు అక్షయ్ కుమార్ ఈ మూవీని ఎందుకు రీమేక్ చేస్తున్నాడు అనే ప్రశ్న అందరి మదిలో మెదులుతోంది. ట్రైలర్ కూడా అచ్చం అలాగే దించడంతో అసలు ఈ మూవీని చూడడానికి జనాలు థియేటర్లలోకి వస్తారా అనేది అనుమానంగానే ఉంది.

Suriya s Soorarai Pottru dubbed Hindi version to release on youtube before Akshay Kumar Sarfiraon Goldmine Telefilms YouTube channel on July 12

ఒరిజినల్ వెర్షన్ కు దర్శకత్వం వహించిన సుధా కొంగర హిందీ రీమేక్ కు కూడా దర్శకురాలిగా వ్యవహరించారు. సూర్య, జ్యోతిక ఈ సినిమాను నిర్మించారు. అయితే ఇప్పటికే ఉన్న అడ్డంకులు చాలవన్నట్టుగా తాజాగా సర్ఫిరా మూవీపై మరో పెద్ద దెబ్బ వేసే ప్లాన్ చేశాడు నిర్మాత మనీష్ షా. గతంలోనే ఈ మూవీ డిజిటల్ రైట్స్ ను దక్కించుకున్న మనీష్ సర్ఫిరా రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో గోల్డ్ మైన్స్ అనే తన యూట్యూబ్ ఛానల్ లో సురారై పొట్రు హిందీ డబ్బింగ్ వర్షన్ ను రిలీజ్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు.

జూలై 12న అంటే సర్ఫిరా మూవీ థియేటర్లలోకి రానున్న రోజునే ఈ మూవీ హిందీ వర్షన్ ను ఆయన యూట్యూబ్ లో రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించడంతో అసలే మూలుగుతున్న నక్కపై తాటికాయ పడ్డట్టుగా అయ్యింది సర్ఫిరా మేకర్స్ పరిస్థితి. మరి మేకర్స్ ఈ నిర్మాత స్ట్రాటజీకి ఎలా అడ్డుకట్ట వేస్తారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక మనీష్ అనౌన్స్మెంట్ చూసిన సూర్య అభిమానులు ఆయన డబ్బు కోసమే ఇలాంటి పని చేస్తున్నాడని మండిపడుతున్నారు.

More from Filmibeat

Read more about: sarfira akshay kumar suriya
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X